Anasuya : ఉగాది రోజున కూడా తప్పలేదు.. వీడియో కాల్‌లో అనసూయ తిప్పలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anasuya : ఉగాది రోజున కూడా తప్పలేదు.. వీడియో కాల్‌లో అనసూయ తిప్పలు

Anasuya : ప్రస్తుతం అనసూయ ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. వెండితెర, బుల్లితెర అనే తేడా లేకుండా అనసూయ దుమ్ములేపుతోంది. బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే.. వెండితెరపైనా దూసుకుపోతోంది. అయితే వెండి తెరపై మాత్రం ఇప్పుడు అనసూయ అంతగా ప్రభావం చూపలేకపోతోంది. రంగస్థలం సినిమాతో వచ్చిన క్రేజ్‌ను అనసూయ బాగానే వాడుకుంటోంది.అనసూయ కెరీర్ రంగమ్మత్త పాత్రకు, రంగస్థలం సినిమాకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆ పాత్రకు వచ్చిన ప్రశంసలతో అనసూయ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అనసూయకు డిమాండ్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :3 April 2022,2:30 pm

Anasuya : ప్రస్తుతం అనసూయ ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. వెండితెర, బుల్లితెర అనే తేడా లేకుండా అనసూయ దుమ్ములేపుతోంది. బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే.. వెండితెరపైనా దూసుకుపోతోంది. అయితే వెండి తెరపై మాత్రం ఇప్పుడు అనసూయ అంతగా ప్రభావం చూపలేకపోతోంది. రంగస్థలం సినిమాతో వచ్చిన క్రేజ్‌ను అనసూయ బాగానే వాడుకుంటోంది.అనసూయ కెరీర్ రంగమ్మత్త పాత్రకు, రంగస్థలం సినిమాకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.

ఆ పాత్రకు వచ్చిన ప్రశంసలతో అనసూయ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అనసూయకు డిమాండ్ బాగా పెరిగింది. ఆ క్రేజ్‌తో అనసూయ కొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను కూడా చేస్తోంది. కానీ అవేవీ వర్కవుట్ అవ్వడం లేదు.చివరగా వచ్చిన పుష్ప, ఖిలాడీ చిత్రాల్లోనూ అనసూయ కనిపించింది. కానీ అవి రెండూ కూడా ఆమెకు నిరాశనే మిగిల్చాయి. పుష్ప హిట్ అయినా కూడా ఆమె పాత్రకు నెగెటివ్ టాక్ వచ్చింది. ఇక ఖిలాడీ ఎలా డిజాస్టర్ అయిందో..

Anasuya In Shoot On Ugadi 2022 And Far away from family

Anasuya In Shoot On Ugadi 2022 And Far away from family

అనసూయ పాత్ర కూడా అంతే డిజాస్టర్‌గా మిగిలింది. మొత్తానికి అనసూయ మాత్రం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.మరీ ఎంత బిజీగా ఉందంటే.. ఉగాది రోజున కూడా పని చేసే అంత బిజీగా ఉంది. అందుకే షూటింగ్ సందర్భంగా వేరే చోట ఉండటంతో ఉగాది రోజున ఫ్యామిలీతో గడపలేకపోయింది. దీంతో వీడియో కాల్ చేసి మాట్లాడుకుందట. అలా అయినా కాస్త ఫ్యామిలీతో ఉన్నట్టు అనిపించిందట. మొత్తానికి పండుగ రోజున అనసూయ ఇలా గడపాల్సి వచ్చింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది