Anasuya : బీచ్‌లో భ‌ర్త‌కు ఘాటు ముద్దు ఇచ్చిన అన‌సూయ‌.. బిత్త‌ర‌పోతున్న నెటిజన్స్

Authored By Sam C | The Telugu News | Updated on : 4 June 2022, 4:00 pm

Anasuya : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు అన‌సూయ‌. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం అన‌సూయ సొంతం. ఈ అమ్మ‌డు ఒక‌వైపు బుల్లితెర‌పై సంద‌డి చేస్తూనే మ‌రోవైపు వెండితెర‌పై నానా ర‌చ్చ చేస్తుంది. ఇంకోవైపు సోష‌ల్ మీడియాలోను తెగ హ‌డావిడి చేస్తుంటుంది.కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా అనసూయ ఓ రొమాంటిక్ వీడియోను షేర్ చేసింది.భర్తతో కలిసి సముద్ర తీరంలో ఎంతగానో ఎంజాయ్ చేస్తోన్న అనసూయ భరద్వాజ్..

దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసింది. మరీ ముఖ్యంగా ఆమె ఓ రొమాంటిక్ వీడియోను వదిలింది. అన‌సూయ షేర్ చేసిన వీడియోలో ఆమె పొట్టి బట్టల్లో కనిపించింది. ఫలితంగా ఆమె అందాలన్నీ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది.అంతేకాదు బీచ్‌లో ఆమె తన భర్తతో పెదాలు ముడివేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. చాలా సార్లు అతడితో ఘాడ చుంబనాలు చేసింది. ఇవి అనసూయ షేర్ చేసిన వీడియోలో కనిపించాయి. ఫలితంగా ఇందులో ఇది మాత్రమే తెగ హైలైట్ అవుతోంది. దీంతో ఈ అమ్మడిపై కొందరు విమర్శలు చేస్తూ కామెంట్లను కూడా పెడుతున్నారు. అనసూయ షేర్ చేసిన వీడియోకి ఓ ప్రత్యేకత ఉంది.

anasuya ki to her husband

anasuya ki to her husband

Anasuya : అన‌సూయ అందం అద‌ర‌హో..

ప్రస్తుతం అనసూయ తన భర్తతో కలసి రొమాంటిక్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. అనసూయ, భరద్వాజ్ దంపతులు తమ 12వ మ్యారేజ్ యానవర్సరీ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. దీనితో వీరిద్దరూ రొమాంటిక్ గా గడుపుతున్నారు.ఈ వీడియో చూస్తుంటే దంప‌తులు ఇద్ద‌రు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నట్టు అర్ధ‌మవుతుంది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వీడియో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. అంతేకాక ఇందులో అన‌సూయ క్యూట్ లుక్స్ మంత్ర ముగ్ధుల‌ని చేస్తుండ‌గా, దీనిపై క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. అన‌సూయ రీసెంట్‌గా పుష్ప చిత్రంలో దాక్షాయ‌ణిగా క‌నిపించి అల‌రించిన విష‌యం తెలిసిందే.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp