Anasuya : అందంతో చంపేస్తున్న అన‌సూయ‌.. బాబోయ్ ఇలా రెచ్చ‌గెట్టేస్తే ఎలా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anasuya : అందంతో చంపేస్తున్న అన‌సూయ‌.. బాబోయ్ ఇలా రెచ్చ‌గెట్టేస్తే ఎలా?

 Authored By sandeep | The Telugu News | Updated on :10 October 2022,4:37 pm

Anasuya : అన‌సూయ‌.. ఈ అమ్మ‌డి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. టీవీ షోస్, సినిమాలు, కాంట్ర‌వ‌ర్సీలు ఇలా ప్ర‌తి చోట వివాదాలు సృష్టిస్తూ హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటుంది. ఇక ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అయిన కూడా సోష‌ల్ మీడియాలో అన‌సూయ చేసే హంగామా మాములుగా ఉండ‌దు. తాజాగా చీర‌క‌ట్టులో కుర్ర‌కారుకి మ‌త్తెక్కించేలా క్యూట్ పోజులు ఇచ్చింది. ప్ర‌స్తుతం అన‌సూయ పిక్స్ ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సులు దోచేస్తున్నాయి. అన‌సూయని ఇలా చూసిన వారెవ‌రికైన పిచ్చెక్క‌డం ఖాయం అంటున్నారు. ప్ర‌స్తుతం అన‌సూయ పిక్స్ వైర‌ల్‌గా మారాయి. అనసూయ యాటిట్యూడ్ తో పాటు తనకు సంబంధం లేని గొడవల్లో తలదూర్చడం దీనికి కారణం అవుతున్నాయి. లైగర్ సినిమాపై ఇండైరెక్ట్ ట్వీట్ వేసి అనసూయ ట్రోల్స్ కి గురైంది.

మూడు రోజుల పాటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆంటీ అంటూ ట్రోల్ చేశారు. ఎప్పుడో 2017లో విడుదలైన అర్జున్ రెడ్డి మూవీ నాటి వివాదాన్ని తెరపైకి తెచ్చి అనసూయ హీరో విజయ్ దేవరకొండకు ఇండైరెక్ట్ కౌంటర్ వేసింది. దీంతో ఆగ్రహానికి గురైన విజయ్ ఫ్యాన్స్ ఆమెపై నెగిటివ్ కామెంట్స్ తో విరుచుకుపడ్డారు . ఇక రీసెంట్‌గా గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ పాల్గొనలేదని మెగా ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అయ్యారు. నువ్వు ఏమైనా నయనతార అనుకుంటున్నావా? చిరంజీవి వంటి పెద్ద హీరో మూవీ ప్రమోషన్స్ ని కూడా డుమ్మా కొడతావా అంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. హెవీ షెడ్యూల్స్ కారణంగా హాజరుకాలేకపోయానని సంజాయిషీ ఇచ్చుకోవ‌ల‌సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక ఆమె పోస్ట్స్ చేస్తున్న వీడియోలు, ఫోటోలపై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. అయిన కూడా ఆమె తగ్గడం లేదు.

anasuya mesmarizing looks viral on twitter

anasuya mesmarizing looks viral on twitter

Anasuya : త‌గ్గేదే లే…

తనను ట్రోల్ చేసేవాళ్లకు ఏదో ఒక రూపంలో కౌంటర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. రీసెంట్‌గా అన‌సూయ చేసిన పోస్ట్ ఒక‌టి నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ”ఎందుకురా నేనంటే మీకు అంత పిచ్చి ప్రేమ. నేను ఏదన్నా మీకు అంత ఇంపార్టెంట్… ఏదన్నా అంత ఫీల్ అవుతారు.. అయ్యో పిచ్చి క్యూటీస్. ఇప్పుడు ఆ పిచ్చి క్యూటీస్ అందరూ మళ్ళీ ఫీల్ అయ్యి రియాక్ట్ అవుతారా? సరే మీకు నాకోసం అంత టైం ఉందంటే మీ ఇష్టం..” అంటూ ట్వీట్ చేసింది. నేను ఏం చేసిన రియాక్ట్ అవుతారు. మీకు పనిలేదా? నాకోసం కేటాయించే సమయాన్ని మీ పనులకు వెచ్చించండని అర్థం వచ్చేలా అనసూయ కౌంటర్ ఇచ్చింది. తనను ట్రోల్ చేసేవారిని అనసూయ పిచ్చి క్యూటీస్ అనడం విశేషం. ఈ గొడ‌వ‌లు అన‌సూయ కెరీర్‌కి ఏమైన ఇబ్బందిగా మార‌తాయా అనేది చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది