Anasuya : పాపం అనసూయ ఇలా అవుతుందని అస్సలు ఊహించి ఉండదు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anasuya : పాపం అనసూయ ఇలా అవుతుందని అస్సలు ఊహించి ఉండదు…!

 Authored By prabhas | The Telugu News | Updated on :9 December 2022,1:00 pm

Anasuya : జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ కెరియర్ చాలా దారుణంగా మారిందట. ఒకప్పుడు రోజు వారి పారితోషికం లో టాప్‌ గా నిలిచిన అనసూయ ఇప్పుడు అవకాశాలు లేక ఎంత తక్కువ ఇచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఓకే చెప్తోందట. గతంలో ఒక్క కాల్ షీట్ కి రెండు నుండి రెండున్నర లక్షల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన ఈ అమ్మడు ఇప్పుడు మాత్రం డిమాండ్ లేకుండా ఎంత ఇచ్చినా కూడా ఓకే అన్నట్లుగా వ్యవహరిస్తుందట. ఇదంతా కూడా ఆమె జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పడం వల్లే అనే విషయం తెలిసిందే.

స్టార్ మా లో ఒక భారీ కామెడీ కార్యక్రమాన్ని ఓంకార్ నిర్వహించేందుకు ప్లాన్ చేసి సుదీర్ మరియు అనసూయ లను రప్పించాడు. కానీ ఓంకార్ అనుకున్నది వర్కౌట్ అవ్వలేదు. దాంతో సుధీర్ మరియు అనసూయ జబర్దస్త్ ను వీడటం పెద్ద తప్పు అని తెలుసుకున్నారు. రోజా సహాయం తో ఇద్దరు కూడా జబర్దస్త్ లో రీ ఎంట్రీ ఇవ్వాలని తీవ్రంగా ప్రయత్నాలు చేశారట. కానీ ఇప్పటి వరకు అది సాధ్యం కావడం లేదు. అనసూయ సినిమా లతో బిజీగా ఉండడం వల్ల జబర్దస్త్ కార్యక్రమానికి డేట్లు ఇవ్వలేక పోతున్నాను అంటూ చెప్పి మల్లెమాల నుండి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే.

Anasuya not getting officers after exit from jabardasth show

Anasuya not getting officers after exit from jabardasth show

కానీ ఇప్పుడు ఆ సినిమాల ఆఫర్స్ కూడా అనసూయకు తగ్గాయి. జబర్దస్త్ లో ఉన్నంత కాలం ఆమె స్టార్ గా వెలుగు వెలిగింది. సోషల్ మీడియాలో కూడా ఆమె పాపులారిటీ హీరోయిన్ స్థాయిలో ఉండేది. కానీ ఇప్పుడు తగ్గిపోయింది. అందుకే ఆమె పారితోషికం కూడా చాలా తగ్గించింది. అయినా కూడా ఆఫర్స్ రావడం లేదట పాపం. జబర్దస్త్ నుండి బయటకు రావడంతో ఆమె స్థాయి చాలా తగ్గిపోయిందని.. ముందు ముందైనా ఆమెకు అదృష్టం కలిసి రావాలని కోరుకుంటున్నాం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి