Anasuya : ఓ రోజు మీతో నటించాలనుకున్నా.. అల్లు అర్జున్‌పై అనసూయ కామెంట్స్..
Anasuya : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’ మొదటి భాగాన్ని ఈ నెల 17వ తేదీన విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ వేడుకకు మెగా అభిమానులు తరలివచ్చారు. డైరెక్టర్ సుకుమార్ మిక్సింగ్ పనుల్లో ముంబైలో ఉండిపోగా, మూవీ యూనిట్ సభ్యులు హీరో, హీరోయిన్ , కీలక పాత్రలు పోషించిన నటీ నటులు వచ్చారు. డైరెక్టర్స్ రాజమౌళి, కొరటాల శివ వచ్చి బెస్ట్ విషెస్ చెప్పారు.
ఈ వేడుకలో బుల్లితెర యాంకర్, వెండితెర నటి అనసూయ భరద్వాజ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై ఓపెన్ అండ్ హాట్ కామెంట్స్ చేసింది.తనకు నిజంగా ‘పుష్ప’ సినిమా ఓ కలలా ఉందని, రెండేళ్ల నుంచి తను ప్రేక్షకులను చాలా మిస్ అయ్యానని అంది. ఈ క్రమంలోనే హీరో అల్లు అర్జున్‌కు థాంక్స్ చెప్పింది. జనరల్‌గా అందరూ అమ్మానాన్నను, దేవుడిని కోరికలు కోరుకుంటారని, కానీ, తాను మాత్రం ఓ రోజు మీతో నటించాలని ఉందని బన్నీనే కోరుకున్నానని ఓపెన్ కామెంట్స్ చేసింది. ఇక అలా కోరకుకున్న వారం రోజుల్లోనే తనకు సినిమాలో అవకాశం ఉందని ఫోన్ వచ్చిందని గుర్తు చేసుకుంది అనసూయ.

anasuya open comments onAllu Arjun
Anasuya : అలా అనుకోగానే అవకాశమొచ్చేసిందన్న అనసూయ..
తన సినీ కెరీర్‌లో ‘రంగస్థలం’ సినిమా, రంగమ్మత్త పాత్ర మైల్ స్టోన్ అని పేర్కొంది. ‘పుష్ప’ సినిమా కోసం మూవీ యూనిట్ సభ్యులు, డైరెక్టర్ సుక్కు చాలా కష్టపడ్డారని తెలిపింది. ఇక రానున్న రోజుల్లో తనను, సునీల్‌ను ప్రేక్షకులు చాలా ఇష్టపడతారని చెప్పింది. అనసూయ ఈ సినిమాలో ‘దాక్షాయణి’గా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పాత్రలో సునీల్‌కు జోడీగా కనిపించనుంది. సునీల్ ఈ పిక్చర్‌లో నెగెటివ్ షేడ్స్ ఉన్న ‘మంగళం శ్రీను’ రోల్ ప్లే చేస్తున్నారు.