Anasuya : కొంటెచూపులతోనే మత్తెక్కిస్తున్న అనసూయ.. ఆ ఫోజిచ్చిన పిక్ వైరల్..!
Anasuya : బుల్లితెరపై యాంకర్‌గా సందడి చేస్తూనే వెండితెరపైన పలు పాత్రలు పోషిస్తూ అనసూయ భరద్వాజ్.. ప్రజెంట్ ఫుల్ బిజీ యాక్ట్రెస్ అయిపోయింది. ‘రంగస్థలం’ చిత్రం ద్వారా ఈ భామకు మంచి పేరొచ్చింది. ఇకపోతే సోషల్ మీడియాలోనూ అనసూయ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా అనసూయ షేర్ చేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.వెండితెరపైన పలు పాత్రలను పోషిస్తున్న అనసూయకు ఇటీవల హోస్ట్‌గా మరో బంపర్ ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. జెమినీ టీవీలో ప్రసారమయ్యే ‘మాస్టర్ చెఫ్ తెలుగు’ ప్రోగ్రాంకు హోస్ట్‌గా సెలక్ట్ అయింది.
ప్రతీ శుక్రవారం 8.30 గంటలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటో ఒకదాన్ని షేర్ చేసింది అనసూయ. ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. తనపై గాసిప్ తాను బాస్‌గా ఎదుగుతానని, మీరు మారితే తాను ఇంకా సంపాదిస్తాననే అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ జత చేస్తూ ఒక ఫొటో షేర్ చేసింది అనసూయ. సదరు ఫొటోలో రెడ్ కలర్ టాప్, వైట్ మిడ్డీ ధరించి ఉంది అనసూయ.
Anasuya : అటు వైపునకే చూస్తు హోయలు పోతున్న అనసూయ..
తన చెవులకు పింక్ కలర్ హ్యాంగింగ్స్ ఉండగా, కుడి చేతికి ఫ్లవర్ రింగ్, ఎడమ చేతిలో నాలుగు వేళ్లకు గోల్డ్ ఉంగరాలు, ట్యాటూ ఉండటం గమనార్హం. ఇక ఈ ఫొటో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘బ్యూటిఫుల్, గార్జియస్ ఆంటీ, సూపర్’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.