Anasuya : అనసూయ పొంగల్ సెలబ్రేషన్స్.. భర్తతో కలిసి పతంగులు ఎగరేస్తున్న యాంకర్..!
Anasuya: అందాల ముద్దుగుమ్మ అనసూయ ఏం చేసినా కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఈ అమ్మడు ఒకవైపు బుల్లితెరపై తెగ సందడి చేస్తూనే మరోవైపు వెండితెరపై ఆసక్తికర పాత్రలు చేస్తుంది. టాలీవుడ్ లో అనసూయతో పోటీ పడే యాంకర్స్ చాలా మందే ఉన్నారు. కానీ వారందరికీ అనసూయ తరహాలో వెండితెరపై ఛాన్సులు రావడం లేదు. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది.
పుష్పలో అనసూయ దాక్షాయణిగా అదరగొట్టింది. ఇప్పుడు పుష్ప 2లో ఆమె పాత్ర మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని సమాచారం. అయితే ఈ అమ్మడు తాజాగా సంక్రాంతి పండుగ వేడుకలని సంతోషంగా జరుపుకుంది. తన భర్త, పిల్లలతో కలిసి అనసూయ తెగ సందడి చేసింది. పతంగులు ఎగరవేస్తూ చీరకట్టులొఓ ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌కి కుర్రకారు మంత్రముగ్ధులు అవుతున్నారు. అనసూయ క్యూట్ పిక్స్ వైరల్‌గా మారాయి.

anasuya pongal celebrations viral
Anasuya : పొంగల్ సెలబ్రేషన్స్ లో అనసూయ
ఇక అనసూయ చివరిగా పుష్ప సినిమాలో విలన్ మంగళం శీను పాత్రలో సునీల్ కనిపించగా అతని భార్య పాత్రలో అనసూయ తన పెర్ఫార్మెన్స్తో అందరి దృష్టిని ఆకర్షించింది.అనసూయ కనిపించింది కొన్ని సన్నివేశాలు అయినప్పటికీ చాలా విభిన్నమైన లుక్కుతో ఆకట్టుకుంది. అయితే మొదటి పార్టు ఆఖర్లో అనసూయ పాత్ర పగ తో రగిలి పోతూ ఉంటుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటుంది. ఇక సినిమా సెకండ్ పార్ట్ లో అనసూయ పాత్ర మరింత హైలైట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.