Anasuya : ఆ విషయమై మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించిన అనసూయ.. ఇదెక్కడి న్యాయం అంటూ నిలదీత..
Anasuya : బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా చాలా యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు విషయాల్లో అనసూయ తన అభిప్రాయాన్ని బలంగానే చెప్తుంటుంది. ఈ క్రమంలో తనను ఎవరైనా ట్రోల్ చేస్తే కౌంటర్ కూడా ఇస్తుంటుంది. తాజాగా ఓ విషయమై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది. ఆ విషయంలో జరుగుతున్న అన్యాయం గురించి వివరిస్తూనే తమ సమస్యలు పరిష్కరించాలని అనసూయ విజ్ఞప్తి చేసింది.‘జబర్దస్త్ ’ముద్దుగుమ్మ అనసూయ స్కూల్స్ ఓపెనింగ్స్‌పైన స్పందించింది. దాదాపు రెండేళ్ల పాటు కరోనా విలయ తాండవం చేసిందని, ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందని అనసూయ పేర్కొంది.
ఈ క్రమంలోనే ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నారని, కానీ, పిల్లలు ఇంకా టీకాలు తీసుకోలేదని, అయినా స్కూల్స్ ఓపెన్ అయ్యాయని, పిల్లలను స్కూల్స్‌కు పంపించాలని స్కూల్స్ యాజమాన్యాలు కోరుతున్నాయని తెలిపింది. కాగా, అలా వారు పిల్లలను స్కూల్స్‌కు పంపుతున్న క్రమంలో టీకా వేయాల్సిన వయసు కంటే చిన్న వారైనా పిల్లల సంగతి ఏంటని, పిల్లలు పాఠశాలలో ఉన్నపుడు ఏదైనా జరిగితే తమకు సంబంధం లేదని యాజమాన్యాలు పిల్లల పేరెంట్స్‌తో సిగ్నేచర్స్ చేయించుకుంటున్నారని పేర్కొంది. ఇదెక్కడి న్యాయం.. ఇది ఎంత వరకు సమంజసం డియర్ కేటీఆర్ సర్ అని అనసూయ మంత్రిని ప్రశ్నించింది. అసలు లాక్ డౌన్ ఎప్పుడొచ్చింది? అన్‌లాక్ ప్రక్రియ ఎందుకు మళ్లీ షురూ చేశారని అడిగింది అనసూయ. ఈ విషయాలన్నిటిపై మీరు మార్గదర్శకం ఇవ్వాలని, మీరు ఇస్తారని ఆశిస్తున్నానని అనసూయ ట్వీట్ చేసింది.
Anasuya : మంత్రి కేటీఆర్‌ను సూటిగానే ప్రశ్నించిన అనసూయ..
ఇకపోతే పిల్లలను స్కూల్స్‌కు పంపాలని స్కూల్స్ యాజమాన్యాలు అలా చేయడం సరికాదని నెటిజన్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. అనసూయ అభిప్రాయంతో చాలా మంది ఏకీభవిస్తున్నట్లు రీట్వీట్స్ చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యాలకు పిల్లలపై బాధ్యత లేదా అని అడుగుతున్నారు. తమకు బాధ్యత లేదని అలా పేరెంట్స్‌తో సిగ్నేచర్ తీసుకోవడం తప్పని అభిప్రాయపడుతున్నారు. ఈ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి..