Anasuya : ఆ మాట మీరన్నారు.. మేం అనలేం యాంకర్ అనసూయ

Authored By Cinema Desk | The Telugu News | Published on: January 11, 2022, 6:30 pm

Anasuyaబుల్లితెరపై యాంకర్ అనసూయ అందాల జాతర మామూలుగా ఉండదు. జబర్దస్త్ షోలో జబర్దస్త్ యాంకర్‌గా అందాల విందు చేస్తుంటుంది. అప్పుడప్పుడు ఆది స్కిట్లో నటిస్తూ నవ్వులు పూయిస్తుంటుంది. ఇక ఆమె మీద టీం లీడర్లు వేసే పంచ్‌లు, ఆమె స్కిట్ల మీద వేసే కౌంటర్లు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ కంటెస్టెంట్ మీద అనసూయ తన మనసులోని మాటను చెప్పేసింది.

సంక్రాంతి స్పెషల్ అంటూ రాబోతోన్న జబర్దస్త్ ఎపిసోడ్‌లో డైరెక్టర్ మారుతి స్పెషల్ గెస్టుగా వచ్చాడు. ఇందులో మారుతి వేసిన ఓ కౌంటర్ మీద అనసూయ సెటైర్ వేసింది. జబర్దస్త్ షోలోకి మధ్యలో వచ్చిన తాగుబోతు రమేష్ ఇప్పటికీ నిలదొక్కుకోలేకపోతోన్నాడు. రమేష్‌కు ఈ షో నెగెటివ్‌గానే అవుతోంది. ఎంతలా ట్రై చేసినా కూడా సెట్ అవ్వడం లేదు.

Anasuya Satires On Thagubothu Ramesh

Anasuya Satires On Thagubothu Ramesh

Anasuya : మారుతి మాటలపై అనసూయ

తాజాగా మారుతి తాగుబోతు రమేష్ మీద కౌంటర్లు వేశాడు. నువ్ ఎలా వచ్చినా కూడా బార్‌లోంచి వచ్చినట్టే కనిపిస్తోందని కౌంటర్లు వేస్తాడు మారుతి. అలా మారుతి అనడంతోనే అనసూయ అందుకుంది. మీరు అన్నట్టుగా మేం అనలేం కదా.. అంటూ తనకు కూడా అలానే అనిపించిందంటూ పరోక్షంగా తాగుబోతు రమేష్ మీద అనసూయ సెటైర్లు వేసింది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp