Home » Entertainment » Anasuya Shcking Answer To Netigen
Entertainment

Anasuya : మీ ఆయన బాగా చేస్తారా.. మీరు బాగా చేస్తారా.. నెటిజన్ అడిగిన ప్రశ్నకి షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన అనసూయ..!

Authored By
aruna
The Telugu News | Published on: October 2, 2023, 8:00 pm
Advertisement

Anasuya : బుల్లితెర మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ షో ద్వారా అనసూయకు ఎటువంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ద్వారానే ఆమెకు వెండితెరపై వరుసగా అవకాశాలు వస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే అనసూయ వెండితెరపై బిజీగా ఉండడంతో జబర్దస్త్ పూర్తిగా వదిలేశారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న అనసూయ ఇటీవల ‘ పెదకాపు ‘ సినిమాలో నటించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనసూయ అక్కమ్మ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. ఇక అనసూయ సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

Advertisement

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా అనసూయ సోషల్ మీడియాలో తన అభిమానులతో కాసేపు ముచ్చటించారు. తనకు 40 నిమిషాల సమయం మాత్రమే ఉందని, ఎవరైనా ఏదైనా ప్రశ్న అడగాలంటే అడగొచ్చు అని ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో మాట్లాడారు. ఈ క్రమంలోనే చాలామంది అనసూయ నటించిన పెదకాపు సినిమాలోని అక్కమ్మ పాత్ర గురించి కొన్ని ప్రశ్నలు వేశారు. అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రశ్నించారు.

Advertisement

Anasuya shcking answer to Netigenఈ క్రమంలోనే ఒక నెటిజన్ అనసూయను ఒక ప్రశ్న అడిగాడు. మీ ఇంట్లో ఎవరు బాగా వంట చేస్తారు మీరు బాగా చేస్తారా లేక మీ ఆయన బాగా చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ మా ఆయన కంటే నేనే బాగా చేస్తాను. మా ఆయన కోసం ప్రేమగా వంట చేస్తే ఆయన నాకోసం చేస్తారు అంటూ సమాధానం చెప్పింది. అలాగే మరొక నెటిజన్ మీరు ఎన్ని టాటూస్ వేయించుకున్నారు అని అడిగారు. దానికి అనసూయ సమాధానం చెబుతూ తాను రెండు మాత్రమే వేయించుకున్నానని ఒకటి తన చేతి మీద ఉన్నది, మరొకటి ఎద భాగంలో ఉంటుందని తెలియజేశారు. అయితే మొదటిది తన భర్తతో ఎంగేజ్మెంట్ జరిగిన రోజు తన భర్త పుట్టినరోజు కూడా కావడంతో తన పేరును టాటూగా వేయించుకున్నాను అని చెప్పారు. మరొకటి తన చేతి మీద ఉన్న టాటూ విషయం మనకు తెలిసిందే.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి