Anasuya : ఘాటెక్కిస్తున్న అనసూయ అందాలు.. చిత్తైపోతున్న ఫ్యాన్స్
Anasuya : బుల్లితెరని తన అందచందాలతో షేక్ చేసే అందాల ముద్దుగుమ్మలలో అనసూయ ఒకరు. ఆకట్టుకునే రూపం.. అద్భుతమైన హోస్టింగ్.. ఆహా అనిపించే హావభావాలతో మైమరపిస్తోన్న ఈ బ్యూటీ.. సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూనే ఉంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని స్టైలిష్ పిక్స్ షేర్ చేసింది. గుట్టలాంటి ప్రదేశాన్ని ఎంచుకొని కెమెరా ముందు జబర్దస్తీ చేసింది అనసూయ. ఎక్స్‌పోజింగ్ అంతగా లేకపోయినప్పటికీ చూపులతోనే కట్టిపడేస్తోంది.
ఈ పిక్స్ చూసి నెటిజన్లు వావ్ సూపర్ అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. అనసూయ ఎలాంటి పిక్స్ పెట్టిన అవి కొద్ది క్షణాలలో వైరల్ కావల్సిందే. అనసూయ చాలా కాలం క్రితమే యాంకర్‌గా తన కెరీర్‌ను ఆరంభించింది. జబర్ధస్త్ షో ద్వారా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో గుర్తింపును దక్కించుకుంది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. ఫలితంగా తన కెరీర్‌ను జబర్ధస్త్‌గా ముందుకు నడుపుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. మొదట సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన అనసూయ పెద్దగా గుర్తింపు సంపాదించలేక పోయింది.

anasuya shows glamorour in these pics
Anasuya : ఆహా.. అనసూయ అందం..
ఆ తర్వాత కొన్ని ప్రైవేట్ కంపెనీలో జాబ్ కూడా చేసి శశాంక్ భరద్వాజ్‌ని పెళ్లి చేసుకున్న అనంతరం భర్త సహకారంతో మళ్ళీ టెలివిజన్ ప్రపంచంలోకి వచ్చేసింది. జబర్దస్త్ వేదిక అనసూయకు కావాల్సినంత నేమ్, ఫేమ్ తెచ్చిపెట్టింది. బుల్లితెరకు కొత్త శోభ తెస్తూ ప్రతివారం అనసూయ స్టైలిష్ లుక్స్ జనాలను బాగా అట్రాక్ట్ చేసేశాయి. దీంతో ఒక్కసారిగా అనసూయ కెరీర్ గ్రాఫ్ పీక్స్‌కి వెళ్ళిపోయింది. బుల్లితెరతో పాటు వెండితెరపై అవకాశాలు అందిపుచ్చుకుంటూ తెగ హంగామా చేస్తోంది అనసూయ. పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి తన టాలెంట్ చూపించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అనసూయ క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది.