Home » Entertainment » Anasuya Want Baby Girl In Show Who Is That Cute Baby
Entertainment

Anasuya : శ్రీరామ నవమి ఈటీవీ స్పెషల్‌ కార్యక్రమంలో అనసూయ ఎత్తుకున్న పాప ఎవరు?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: April 7, 2022, 8:30 pm
Advertisement

Anasuya : ఈ టీవీ మల్లెమాల వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు దాదాపు అన్ని కూడా సూపర్ హిట్ అవుతున్నాయి. జబర్దస్త్, ఎక్స్ ట్రా, జబర్దస్త్, క్యాష్, ఢీ డాన్స్ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంకా పలు కార్యక్రమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్న నేపద్యంలో ప్రతి పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ నిర్వహిస్తూ ఈ టీవీ లో టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. మొత్తానికి ఈటీవీ మల్లె మాల వారి బాండింగ్ మంచి సక్సెస్ లను తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో రాబోయే శ్రీ రామ నవమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అంటూ అనసూయ, ప్రదీప్ లు ఇంకా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కమెడియన్స్ అందరూ కూడా ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Advertisement

ఇటీవల విడుదలైన ప్రోమో ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రోమో లో అనసూయ ఒక చిన్నారి పాప ని ఎత్తుకుని ఉన్నట్లుగా చూపించారు. ఇద్దరు కొడుకులు ఉన్న అనసూయ తనకు ఒక బిడ్డ లేదు అనే బాధ ఎప్పుడూ ఉంటుంది అంటూ కన్నీరు పెట్టుకుంది. తాను బిడ్డ కోసం ఎంతో ప్రయత్నిస్తున్నానని కూడా చెప్పుకొచ్చింది. దాంతో పాటు ఆ బిడ్డను ఎత్తుకుని ఎంతో ఆప్యాయంగా తన సొంత కూతురు మాదిరిగా చూసుకోవడంతో ఆ పాపను దత్తత తీసుకుందా.. లేదంటే అక్కడే ఉన్న మరెవరికైనా చెందిన పాపనా అంటూ చర్చ మొదలైంది.

Anasuya want baby girl in show who is that cute baby

Advertisement

అనసూయ కాస్త ఎమోషనల్ అవ్వడంతో అనేక రకాల పుకార్లకు తెరలేసింది. ఇంతకు అనసూయ చేతి లో ఉన్న పాప ఎవరు.. నిజంగానే అనసూయ దత్తత తీసుకుందా అనేది తెలియాల్సి ఉంది. అనసూయ కు ఇద్దరు కొడుకులు అవ్వడంతో ఆమె మళ్ళీ ఒక బిడ్డకు జన్మనివ్వడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తుందా అనే చర్చ కూడా ఇక్కడ జరుగుతుంది. ఒక బిడ్డ కావాలంటూ కోరుకుంటున్నానని అనసూయ చెప్పినప్పుడు పక్కనే ఉన్న ప్రదీప్ తధాస్తు అంటూ దీవించాడు. అంటే ఖచ్చితంగా అనసూయ ఇప్పుడు కాకుంటే మరి కొన్నాళ్ళ తర్వాత అయినా ఆ అమ్మాయికి జన్మనిస్తుందేమో అంటూ చర్చ జరుగుతోంది. ఒకవేళ అమ్మాయికి జన్మనివ్వకుండా అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకునే అవకాశాలు కూడా లేకపోలేదు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి