#image_title
Anchor Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక యాంకర్ స్థాయి నుంచి తను ఇప్పుడు హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. తను సినిమాలో చేసేది చిన్న పాత్రలే అయినా తనకు ఉన్న క్రేజ్ వేరు. బుల్లి తెరను కొన్నేళ్ల పాటు రూల్ చేసిన అనసూయ.. ఇప్పుడు సినిమాల్లో బిజీ అయిపోయింది. చిన్న పాత్రలు, పెద్ద పాత్రలే కాదు.. హీరోయిన్ పాత్రలు కూడా చేస్తోంది. పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా తమ సినిమాల్లో అనసూయ ఉండాలని తన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారంటే అనసూయకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అనసూయ ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తోంది. రజాకర్ సినిమాలో పెద్ద క్యారెక్టర్ లో నటించింది అనసూయ. ఇటీవల ఈ సినిమాలోని ఓ పాటను విడుదల చేసింది మూవీ యూనిట్. ఆ సాంగ్ అనసూయ మీద చిత్రీకరించారు. ఆ సాంగ్ లాంచ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు.
ఈ సినిమాను ఓ బీజేపీ నేత నిర్మిస్తుండటంతో అనసూయ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ అనసూయ పొలిటికల్ ఎంట్రీపై తెగ పుకార్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో వాటన్నింటిపై అనసూయ క్లారిటీ ఇచ్చేసింది. రజాకర్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో అనసూయ క్లారిటీ ఇచ్చింది. లాంచ్ ఈవెంట్ లోనూ అనసూయకు ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. ఆ ఈవెంట్ లో అనసూయను మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా.. అని ప్రశ్నించారు. దీంతో నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు. రాజకీయం అని నా వల్ల కాదు. నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. రాజకీయ నాయకులను వాళ్ల పని వాళ్లను చేయనిద్దాం అంటూ అనసూయ చెప్పుకొచ్చింది.
#image_title
రాజకీయాల్లోకి రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు.. అంటూ పొలిటికల్ ఎంట్రీపై అనసూయ క్లారిటీ ఇవ్వడంతో సోషల్ మీడియా పుకార్లకు పుల్ స్టాప్ పడ్డాయి. తమ సినిమాల షూటింగ్ సమయంలో, సినిమా ఇండస్ట్రీలో కూడా ఎప్పుడూ రాజకీయాల గురించి మేము మాట్లాడుకోమని అనసూయ స్పష్టం చేసింది. ప్రస్తుతం అనసూయ పుష్ప 2 సినిమాలో కీ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.