Anchor Anasuya : రాజకీయాల్లోకి యాంకర్ అనసూయ.. ఆ పార్టీ నుంచి పోటీ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anchor Anasuya : రాజకీయాల్లోకి యాంకర్ అనసూయ.. ఆ పార్టీ నుంచి పోటీ?

Anchor Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక యాంకర్ స్థాయి నుంచి తను ఇప్పుడు హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. తను సినిమాలో చేసేది చిన్న పాత్రలే అయినా తనకు ఉన్న క్రేజ్ వేరు. బుల్లి తెరను కొన్నేళ్ల పాటు రూల్ చేసిన అనసూయ.. ఇప్పుడు సినిమాల్లో బిజీ అయిపోయింది. చిన్న పాత్రలు, పెద్ద పాత్రలే కాదు.. హీరోయిన్ పాత్రలు కూడా చేస్తోంది. పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా తమ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :11 October 2023,5:00 pm

Anchor Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక యాంకర్ స్థాయి నుంచి తను ఇప్పుడు హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. తను సినిమాలో చేసేది చిన్న పాత్రలే అయినా తనకు ఉన్న క్రేజ్ వేరు. బుల్లి తెరను కొన్నేళ్ల పాటు రూల్ చేసిన అనసూయ.. ఇప్పుడు సినిమాల్లో బిజీ అయిపోయింది. చిన్న పాత్రలు, పెద్ద పాత్రలే కాదు.. హీరోయిన్ పాత్రలు కూడా చేస్తోంది. పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా తమ సినిమాల్లో అనసూయ ఉండాలని తన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారంటే అనసూయకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అనసూయ ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తోంది. రజాకర్ సినిమాలో పెద్ద క్యారెక్టర్ లో నటించింది అనసూయ. ఇటీవల ఈ సినిమాలోని ఓ పాటను విడుదల చేసింది మూవీ యూనిట్. ఆ సాంగ్ అనసూయ మీద చిత్రీకరించారు. ఆ సాంగ్ లాంచ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు.

ఈ సినిమాను ఓ బీజేపీ నేత నిర్మిస్తుండటంతో అనసూయ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ అనసూయ పొలిటికల్ ఎంట్రీపై తెగ పుకార్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో వాటన్నింటిపై అనసూయ క్లారిటీ ఇచ్చేసింది. రజాకర్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో అనసూయ క్లారిటీ ఇచ్చింది. లాంచ్ ఈవెంట్ లోనూ అనసూయకు ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. ఆ ఈవెంట్ లో అనసూయను మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా.. అని ప్రశ్నించారు. దీంతో నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు. రాజకీయం అని నా వల్ల కాదు. నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. రాజకీయ నాయకులను వాళ్ల పని వాళ్లను చేయనిద్దాం అంటూ అనసూయ చెప్పుకొచ్చింది.

anchor anasuya gives clarity on entering politics

#image_title

Anchor Anasuya : అనసూయ పొలిటికల్ ఎంట్రీ లేనట్టేనా?

రాజకీయాల్లోకి రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు.. అంటూ పొలిటికల్ ఎంట్రీపై అనసూయ క్లారిటీ ఇవ్వడంతో సోషల్ మీడియా పుకార్లకు పుల్ స్టాప్ పడ్డాయి. తమ సినిమాల షూటింగ్ సమయంలో, సినిమా ఇండస్ట్రీలో కూడా ఎప్పుడూ రాజకీయాల గురించి మేము మాట్లాడుకోమని అనసూయ స్పష్టం చేసింది. ప్రస్తుతం అనసూయ పుష్ప 2 సినిమాలో కీ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది