Anchor Lahari : దానికి మా ఆయన ఒప్పుకోడు!.. బుక్కైన సీరియల్ నటి యాంకర్ లహరి
Anchor Lahari : బుల్లితెరపై వ్యాఖ్యాతగా ఎన్నో సంవత్సరాల నుంచి విజయపథంలో దూసుకుపోతున్న క్యాష్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి వారం ఈ కార్యక్రమానికి ఎంతో మంది సెలబ్రిటీలు హాజరయ్యి ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తారు.ఈ క్రమంలోనే ఈ శనివారం ప్రసారమయ్యే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా సీరియల్ ఆర్టిస్టులు కౌశిక్-కళ్యాణ్, లహరి -సంయుక్త, సుమిత్- హిత్రేష్, అనిల్ -రవి కిరణ్ వచ్చారు.
ఇక ఈ ప్రోమోలో భాగంగా సుమ అందరితో కలిసి ఎప్పుడులాగే తనదైన శైలిలో వారిపై పంచ్ డైలాగులు వేయడంతో సుమిత్ సుమ పై పంచ్ ల వర్షం కురిపించాడు.ఈ కార్యక్రమంలో భాగంగా కొందరు కాలేజ్ స్టూడెంట్స్ రావడం మనకు తెలిసిందే ఇలా వచ్చిన వారిలో ఒక అబ్బాయి లహరిని పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పడంతో లహరి తనకు ఆల్రెడీ పెళ్లయిందని సమాధానం చెబుతుంది. ఆయన పర్లేదు అంటూ ఆ కుర్రాడు లహరికి షాకిచ్చాడు. ఇక ఈ కార్యక్రమంలో ఒక స్కిట్ లో భాగంగా లహరి రవి కిరణ్ భార్యాభర్తలుగా నటించారు.

Anchor lahari comments in viral anchor suma cash show
Anchor Lahari : అమ్మ నాన్నలు కలిసి ఉండాలి..
ఈ కార్యక్రమంలో క్యాష్ జాతరలో భాగంగా లహరి రవికిరణ్ కొడుకులు తప్పి పోవడంతో వారిని వెతికి పట్టుకోవాలని చెబుతారు. ఇలా ఓ కుర్రాడు రావడంతో మన బాబు అని రవి కిరణ్ చప్పగా నాకెందుకు చెబుతున్నావ్ నీ పని నువ్వు చూసుకో అంటూ సమాధానం చెబుతుంది. అనంతరం కుర్రాడు మా అమ్మానాన్నలు కలిసి ఉండాలి అని అనడంతో వెంటనే లహరి అందుకు మా ఆయన ఒప్పుకోడమ్మా అని సమాధానం చెబుతూ అడ్డంగా బుక్కయింది. ఇలా ఈ ప్రోమో ఎంతో సరదాగా సాగిపోయింది. మరింత పూర్తి వినోదం చూడాలంటే ఈ ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.
