Dhee Show : ఈటీవీలో సుదీర్ఘ కాలంగా టెలికాస్ట్ అవుతున్న ఢీ షో ఒకానొక సమయంలో టాప్ రేటింగ్ ను దక్కించుకుంది. కాని ఇప్పుడు మాత్రం ఢీ షో కు అత్యంత దారుణమైన రేటింగ్ నమోదు అవుతుంది. అందుకు కారణం షో నుండి సుడిగాలి సుధీర్ వెళ్లి పోవడం మరియు రష్మీ ని తప్పించడం. వారు వెళ్లి పోయారు ఏదో విధంగా నెట్టుకు వద్దాం అనుకుంటూ ఉన్న షో నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఆది కొన్ని రోజులు కనిపించలేదు. మళ్లీ ఇప్పుడు వస్తున్నా కూడా పెద్దగా సందడి చేస్తున్న దాఖలాలు మాత్రం లేవు. ఇక వచ్చే సీజన్ మరింత దారుణంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
గత సీజన్ లో ఉన్న వారు ఈ సీజన్ లో లేరు.. ఈ సీజన్ లో ఉన్న వారు వచ్చే సీజన్ లో కనిపించరట. ముఖ్యంగా హైపర్ ఆది ఇప్పటికే దుఖాణం సర్దేసుకునేందుకు సిద్దంగా ఉన్నాడు. అంతే కాకుండా యాంకర్ గా ప్రదీప్ కూడా దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు మాత్రమే కాకుండా ఇంకా జడ్జ్ లు కూడా కనిపించకుండా పోయే అవకాశాలు ఉన్నాయంటూ బుల్లి తెర వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఇప్పటికే దారుణమైన రేటింగ్ ఉన్న ఢీ ని ప్రదీప్ కూడా వదిలేస్తే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈటీవీలో ఇప్పటికే జబర్దస్త్ కార్యక్రమానికి గడ్డుకాలం నడుస్తోంది.
ఇలాంటి సమయంలో ఢీ నుండి కూడా కంటెస్టెంట్స్ మాత్రమే కాకుండా యాంకర్ లు మరియు జడ్జ్ లు వెళ్తే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో గత కొన్నాళ్లుగా ఢీ గురించి చాలా బ్యాడ్ టాక్ నడుస్తుంది. కనుక ఢీ నుండి పెద్ద ఎత్తున పాజిటివ్ కంటెంట్ ను ప్రేక్షకులు ఆశిస్తున్నారు. పాజిటివ్ కంటెంట్ ఏమో కాని తర్వాత సీజన్ లో కనీసం ప్రదీప్ కూడా కనిపించడు అనే విషయం తెలిసి ఢీ షో అభిమానులు అవాక్కవుతున్నారు. ఈ సమయంలో ఢీ ని కాపాడేది ఎవరు అంటూ అంతా కూడా దిక్కులు చూస్తున్నారు.
Diwali Gifts : ముఖేష్ అంబాని Mukesh Ambani దీపావళి Diwali సందర్భంగా రిలయన్స్ ఎంప్లాయీస్ కి సర్ ప్రైజ్…
పీఎం ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం జి.ఏ.వై) కింద ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య ఇంకా…
OIls Costlier Price hike : నిత్యావసరాల ధరలు మండిపోతున్న ఈ టైం లో ఒకదానికి మరొకటి అన్నట్టుగా రేట్లు…
Green Beans : సాధారణంగా మనం ప్రతిరోజు ఎన్నో రకాల కూరగాయలను తీసుకుంటూ ఉంటాం. అయితే ఒక్కొక్క కూరగాయలలో ఒక్కో రకమైన…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ పెట్టే ఫిటింగ్‌లు ఊహాజనితం. అప్పటి వరకు ఎంతో క్లోజ్‌గా ఉండేవారి…
Legs : మన శరీరంలో ఎటువంటి మార్పులు వచ్చినా మరియు ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఎటాక్ చేసినా ముందుగా వాటి…
Choti Diwali : ఈ ఏడాది అక్టోబర్ నెలంతా పండుగలతో క్యాలెండర్ నిండిపోయింది. దసరా పండుగ ముగిసిందో లేదో మూడు…
ICAI CA Result 2024 : ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) చార్టర్డ్ అకౌంటెన్సీ (CA) …
This website uses cookies.