Dhee Show : ఢీ షో కొత్త సీజన్‌ కు కొత్త యాంకర్‌.. ఆ కాస్త రేటింగ్ కూడా కష్టమే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Dhee Show : ఢీ షో కొత్త సీజన్‌ కు కొత్త యాంకర్‌.. ఆ కాస్త రేటింగ్ కూడా కష్టమే

Dhee Show : ఈటీవీలో సుదీర్ఘ కాలంగా టెలికాస్ట్‌ అవుతున్న ఢీ షో ఒకానొక సమయంలో టాప్‌ రేటింగ్ ను దక్కించుకుంది. కాని ఇప్పుడు మాత్రం ఢీ షో కు అత్యంత దారుణమైన రేటింగ్ నమోదు అవుతుంది. అందుకు కారణం షో నుండి సుడిగాలి సుధీర్ వెళ్లి పోవడం మరియు రష్మీ ని తప్పించడం. వారు వెళ్లి పోయారు ఏదో విధంగా నెట్టుకు వద్దాం అనుకుంటూ ఉన్న షో నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఆది […]

 Authored By prabhas | The Telugu News | Updated on :19 June 2022,12:30 pm

Dhee Show : ఈటీవీలో సుదీర్ఘ కాలంగా టెలికాస్ట్‌ అవుతున్న ఢీ షో ఒకానొక సమయంలో టాప్‌ రేటింగ్ ను దక్కించుకుంది. కాని ఇప్పుడు మాత్రం ఢీ షో కు అత్యంత దారుణమైన రేటింగ్ నమోదు అవుతుంది. అందుకు కారణం షో నుండి సుడిగాలి సుధీర్ వెళ్లి పోవడం మరియు రష్మీ ని తప్పించడం. వారు వెళ్లి పోయారు ఏదో విధంగా నెట్టుకు వద్దాం అనుకుంటూ ఉన్న షో నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఆది కొన్ని రోజులు కనిపించలేదు. మళ్లీ ఇప్పుడు వస్తున్నా కూడా పెద్దగా సందడి చేస్తున్న దాఖలాలు మాత్రం లేవు. ఇక వచ్చే సీజన్ మరింత దారుణంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

గత సీజన్ లో ఉన్న వారు ఈ సీజన్ లో లేరు.. ఈ సీజన్ లో ఉన్న వారు వచ్చే సీజన్ లో కనిపించరట. ముఖ్యంగా హైపర్‌ ఆది ఇప్పటికే దుఖాణం సర్దేసుకునేందుకు సిద్దంగా ఉన్నాడు. అంతే కాకుండా యాంకర్ గా ప్రదీప్ కూడా దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు మాత్రమే కాకుండా ఇంకా జడ్జ్‌ లు కూడా కనిపించకుండా పోయే అవకాశాలు ఉన్నాయంటూ బుల్లి తెర వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఇప్పటికే దారుణమైన రేటింగ్ ఉన్న ఢీ ని ప్రదీప్ కూడా వదిలేస్తే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈటీవీలో ఇప్పటికే జబర్దస్త్‌ కార్యక్రమానికి గడ్డుకాలం నడుస్తోంది.

Anchor Pradeep also leaving etv Dhee Show

Anchor Pradeep also leaving etv Dhee Show

ఇలాంటి సమయంలో ఢీ నుండి కూడా కంటెస్టెంట్స్ మాత్రమే కాకుండా యాంకర్ లు మరియు జడ్జ్ లు వెళ్తే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సోషల్‌ మీడియాలో గత కొన్నాళ్లుగా ఢీ గురించి చాలా బ్యాడ్‌ టాక్ నడుస్తుంది. కనుక ఢీ నుండి పెద్ద ఎత్తున పాజిటివ్ కంటెంట్‌ ను ప్రేక్షకులు ఆశిస్తున్నారు. పాజిటివ్‌ కంటెంట్‌ ఏమో కాని తర్వాత సీజన్ లో కనీసం ప్రదీప్ కూడా కనిపించడు అనే విషయం తెలిసి ఢీ షో అభిమానులు అవాక్కవుతున్నారు. ఈ సమయంలో ఢీ ని కాపాడేది ఎవరు అంటూ అంతా కూడా దిక్కులు చూస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది