Home » Entertainment » Anchor Pradeep Clarity About Leaving Etv Dance Show Dhee
Entertainment

Anchor Pradeep : ‘ఢీ’ షో ను వదలబోతున్న విషయమై యాంకర్ ప్రదీప్ స్పందన

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: June 21, 2022 12:45 pm
Advertisement

Anchor Pradeep ; దేశ వ్యాప్తం దాదాపు అన్ని భాషల్లో కూడా డాన్స్ షో లు పలు ఎంటర్‌ టైన్మెంట్‌ ఛానల్స్ లో టెలికాస్ట్‌ అవుతూ ఉంటాయి. కాని ఎన్ని డాన్స్ షో లు వచ్చినా.. ఎంత పెద్ద స్టార్స్ హోస్ట్‌ చేసినా.. జడ్జ్మెంట్‌ ఇచ్చినా కూడా తెలుగు ప్రేక్షకులను సుదీర్ఘ కాలంగా ఎంటర్ టైన్ చేస్తున్న ఢీ డాన్స్ షో తర్వాతే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఢీ డాన్స్ షో ను ఈటీవీ మరియు మల్లెమాల వారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని సుదీర్ఘా కాలంగా నిర్వహిస్తూ సక్సెస్‌ అయ్యారు. యాంకర్ లు.. జడ్జ్‌ లు టీమ్ లీడర్ లు ఇలా ఎంతో మంది మారుతూనే ఉన్నా కూడా ఈ షో కు మొన్నటి వరకు మంచి రేటింగ్‌ వచ్చింది.

Advertisement

గత సీజన్ లో ఉన్న సుడిగాలి సుధీర్ మరియు రష్మీలు తప్పుకోవడంతో అసలు సమస్య మొదలు అయ్యింది. గతంలో ఎప్పుడు లేనంత రేటింగ్ ను దక్కించుకున్న ఢీ డాన్స్ షో ఇప్పుడు చాలా డల్‌ అయ్యింది. రేటింగ్ సగానికి పడిపోవడంతో పాటు బ్రాండ్స్ వ్యాల్యూ కూడా చాలా వరకు తగ్గింది. ఏం చేయాలో పాలుపోని ఈ సమయంలో ఢీ పై మరింతగా ప్రభావం పడే విధంగా యాంకర్ ప్రదీప్ కూడా వెళ్లి పోతాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఢీ డాన్స్ షో నుండి ప్రదీప్‌ వెళ్లి పోతే ఇక మిగిలేది ఏంటీ అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఆయన్న వెళ్లకుండా ఆపాలంటూ అభిమానులు ప్రేక్షకులు డిమాండ్‌ చేస్తున్న సమయంలో ప్రదీప్‌ నుండి క్లారిటీ వచ్చింది.

Anchor Pradeep clarity about leaving etv dance show Dhee

Advertisement

మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా తాను ఢీ ను వదిలి వెళ్లడం లేదు. అసలు తనకు ఆ ఆలోచన లేదు అన్నాడు. అయితే ఆయన మాటల్లో ఈ సీజన్ పూర్తి అయ్యే వరకు ఉంటాను అన్నట్లుగా స్పష్టం చేశాడు. కాని వచ్చే సీజన్ గురించి అయితే ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. వచ్చే సీజన్‌ కు ఆయన ఉండడు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సీజన్ లో తాను పూర్తి వరకు ఉంటాను అంటూ వచ్చి చెప్పడం చూస్తూ ఉంటేనే ఆయన వచ్చే ఢీ సీజన్ లో ఉండక పోవచ్చు అనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అవుతోంది. సుధీర్ వెళ్లిన సమయంలోనే చాలా డ్యామేజీ జరిగింది. ఇప్పుడు ప్రదీప్‌ కూడా వెళ్తే ఢీ పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకోవచ్చు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి