Home » Entertainment » Anchor Pradeep Famous Youtuber Shreya Muralidhar Passed Away
Entertainment

Anchor Pradeep : ప్రదీప్ మాచిరాజుతో ‘పెళ్లిచూపులు’..అంతలోనే విషాదం.. నటి శ్రియా మురళీధర్ కన్నుమూత..

Authored By
mallesh
The Telugu News | Published on: December 8, 2021, 7:00 pm
Advertisement

Anchor Pradeep : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. హైదరాబాదీ గర్ల్, యంగ్ యూట్యూబర్, నటి శ్రియా మురళీధర్ హార్ట్ అటాక్‌తో చనిపోయారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఆమెకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే మార్గం మధ్యలో ఆస్పత్రికి తరలిస్తుండగానే ఆమె ప్రాణాలు కోల్పోయారు. 27 ఏళ్ల వయసులోనే ఎవరూ ఊహించని విధంగా అలా శ్రియామురళీధర్ చనిపోయింది. ఈ విషయం తెలుసుకుని సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఎన్నో కలలు కన్న శ్రియా మురళీ ధర్‌కు ఎంతో భవిష్యత్తు ఉందని సంబుర పడుతున్న ఈ సమయంలో ఆమె ప్రాణాలు కోల్పోయి తమను విషాదంలోకి నెట్టేసిందని కుటుంబ సభ్యులు, స్నేహితులు బోరున విలపిస్తున్నారు. చిన్న వయసులోనే ఆమెకు ఇలా హార్ట్ అటాక్ రావడం విచారకరమని బాధపడుతున్నారు. యూట్యూబర్‌గా స్వశక్తితో తన కాళ్ల మీద తాను నిలబడి మంచి పేరు సంపాదించుకున్న శ్రియా మురళీ ధర్ హఠాన్మరణం పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నారు.శ్రియా మురళీధర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ‘పెళ్లి చూపులు’ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు.

anchor pradeep famous youtuber shreya muralidhar passed away

Advertisement

Anchor Pradeep : యాంకర్ ప్రదీప్ ‘పెళ్లిచూపులు’లో పాల్గొన్న శ్రియా మురళీధర్..

ఇక ఆ తర్వాత ఈమె పలు షార్ట్ ఫిల్మ్స్ చేసింది. వాటి ద్వారా మంచి పేరు కూడా సంపాదించుకుంది. ‘బ్యూటీ అండ్ ద బాస్’ సీజన్ టూలోనూ ఈమె నటించింది. ఇన్‌ స్టా గ్రామ్ ఇన్‌ ఫ్లు యెన్స‌ర్‌‌గానూ ఆమె నెటిజన్ల మెప్పు పొందంది. శ్రియామురళీధర్ స్వస్థలం తెలంగాణలోని హైదరాబాద్ -లక్డీ కాపూల్. ‘వాట్ ద ఫన్’అనే యూట్యూబ్ చానల్‌లో ఆమె పలు వీడియోలు చేసి బాగా ఫేమస్ అయ్యారు. సిల్వర్ స్క్రీన్‌పైన కనబడాలనేది ఆమె కోరిక. కాగా, అది నెరవేరకుండానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. శ్రియామురళీధర్ మృతి పట్ల దీప్తీ సునయిన, సినీ నటి సురేఖ కూతురు సుప్రిత ప్రగాఢ సంతాపం తెలిపారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి