Anchor Rashmi : ఆంటీ అంటూ రెచ్చిపోయిన నరేష్.. దరిద్రుడా అంటూ తిట్టేసిన యాంకర్ రష్మీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchor Rashmi : ఆంటీ అంటూ రెచ్చిపోయిన నరేష్.. దరిద్రుడా అంటూ తిట్టేసిన యాంకర్ రష్మీ

 Authored By prabhas | The Telugu News | Updated on :18 July 2022,2:30 pm

Anchor Rashmi : యాంకర్ రష్మీ వయసు మీద చర్చలు జరుగుతూనే ఉంటాయి. యాంకర్ రష్మీ ఏజ్ మీద సుధీర్ టీం ఎన్నో పంచులు వేసింది. ఆమె ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఇంకా మనం నిక్కర్లు వేసుకునే ఉన్నామంటూ ఇది వరకు ఎన్నో పంచులు వేసింది సుధీర్ టీం. ఇక అప్పుడెప్పుడో వచ్చిన హోలీ సినిమాలో కనిపించింది అంటూ ఆటో రాం ప్రసాద్, ఆది వంటి వారు ఇది వరకే సెటైర్లు వేశారు. అయితే తాజాగా పొట్టి నరేష్ మాత్రం అందరి ముందు షోలోనే రెచ్చిపోయాడు.

తాజాగా వచ్చిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ఎపిసోడ్‌లో పొట్టి నరేష్ రెచ్చిపోయాడు. అందరి ముందే ఆంటీ అంటూ పిలిచేశాడు. మొదటి సారి పిలిచినప్పుడు ఏయ్ అంటూ వార్నింగ్ ఇచ్చింది. అయినా కూడా నరేష్ మారలేదు. మళ్లీ వెంటనే ఆంటీ అని పిలిచాడు. దీంతో దరిద్రుడా రారా నీకు ఉంటది అని అనేసింది రష్మీ. అయితే రష్మీ మాత్రం ఈ శ్రీదేవీ డ్రామా కంపెనీని ఎంతో స్పోర్టీవ్‌గా తీసుకుంటున్నట్టు అనిపిస్తోంది.

Anchor Rashmi Fires Jabardasth Naresh In Sridevi Drama Company

Anchor Rashmi Fires Jabardasth Naresh In Sridevi Drama Company

ఎంత మంది ఎన్ని రకాలుగా కౌంటర్లు వేసినా కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. అన్నీ కూడా లైట్‌గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇక ఆది, రాం ప్రసాద్ ఇద్దరూ అయితే రష్మీని పంచ్‌లతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు. ఇక తన మీద తాను కూడా సెటైర్లు వేసేసుకుంటోంది రష్మీ. తాను వచ్చిన నాలుగైదు ఎపిసోడ్‌లు చేశానని, ఏం చేయడం లేదని అందరూ అనుకుంటున్నారా? అంటూ ఎపిసోడ్ ఇంట్రోలో చెప్పేసుకుంది. మొత్తానికి రష్మీ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి