Rashmi Gautam : ర‌ష్మీ తొమ్మిదేళ్ల ల‌వ్ ట్రాక్.. పాత జ్ఞాప‌కాల‌ని త‌వ్వి ఏడ్పించేశారుగా..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Rashmi Gautam : ర‌ష్మీ తొమ్మిదేళ్ల ల‌వ్ ట్రాక్.. పాత జ్ఞాప‌కాల‌ని త‌వ్వి ఏడ్పించేశారుగా..!

Rashmi Gautam : బుల్లితెర యాంకర్ రష్మీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మీ.. సినిమాల్లో సరైన అవకాశాలు రాక‌పోవ‌డంతో యాంక‌ర్ అవతారం ఎత్తింది. జ‌బ‌ర్ధ‌స్త్ షోలో ర‌ష్మీ చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌దు. వ‌చ్చి రాని తెలుగుతో తెగ వినోదం పంచుతూ ఉంటుంది. జబర్థస్త్ షో రష్మీకి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా రష్మీ -సుడిగాలి సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ […]

 Authored By ramu | The Telugu News | Updated on :20 May 2024,10:20 am

Rashmi Gautam : బుల్లితెర యాంకర్ రష్మీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మీ.. సినిమాల్లో సరైన అవకాశాలు రాక‌పోవ‌డంతో యాంక‌ర్ అవతారం ఎత్తింది. జ‌బ‌ర్ధ‌స్త్ షోలో ర‌ష్మీ చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌దు. వ‌చ్చి రాని తెలుగుతో తెగ వినోదం పంచుతూ ఉంటుంది. జబర్థస్త్ షో రష్మీకి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా రష్మీ -సుడిగాలి సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ యాంకర్‌గా నిలిచిన ర‌ష్మీ.. జబర్దస్త్ షోని రక్తికట్టించడంలో, మంచి రేటింగ్‌ రావడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

Rashmi Gautam ర‌ష్మీపై అదిరిపోయే పంచ్..

ర‌ష్మీ అందాలు, క్యూట్‌ డైలాగ్స్ ప్ర‌తి షోలో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తాయి. జబర్దస్త్ కమెడియన్‌ పంచ్ లు వేసినా అంతే స్పోర్టీవ్ గా తీసుకుంటుంది. అందుకే ఇన్నాళ్లపాటు సర్వైవ్‌ అవ్వగలిగింది. సుధీర్ ఉన్న‌ప్పుడు ర‌ష్మీతో మనోడు పంచే వినోదం ప్రేక్ష‌కుల‌కి తెగ న‌చ్చేసేంది. వీరిద్ద‌రు నిజంగా పెళ్లి చేసుకుంటారా అనే అనుమానాలు కూడా క‌లిగేవి. ఇదిలా ఉంటే గతేడాది నుంచి సుడిగాలి సుధీర్‌ జబర్దస్త్ మానేశాడు. సినిమాల్లో బిజీ అవుతున్న నేపథ్యంలో జబర్దస్త్ మానేశాడు సుధీర్‌. దీంతో ఇద్దరు దూరమయ్యారు. ఆ తర్వాత ఏదో ఒకటి రెండు సందర్భాల్లో కలవడం తప్పితే ఆల్మోస్ట్ దూరమయ్యారు. ఇప్పుడు ఒంటరిగానే షోస్‌ చేస్తుంది రష్మి. సుధీర్‌ని మర్చిపోయినట్టే అనేలా ఆమె సాగుతుంది.

Rashmi Gautam ర‌ష్మీ తొమ్మిదేళ్ల ల‌వ్ ట్రాక్ పాత జ్ఞాప‌కాల‌ని త‌వ్వి ఏడ్పించేశారుగా

Rashmi Gautam : ర‌ష్మీ తొమ్మిదేళ్ల ల‌వ్ ట్రాక్.. పాత జ్ఞాప‌కాల‌ని త‌వ్వి ఏడ్పించేశారుగా..!

ఈ క్రమంలో తన పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు జబర్దస్త్‌ కమెడియన్‌. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో రైల్వే ట్రాక్‌కి సంబంధించిన స్కిట్‌ని ప్రదర్శించారు. రైల్ లేట్‌ అవుతుందని తెలియడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ వారితో ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ పెట్టుకుందామనుకున్నారు. దీంతో యాంకర్‌ రష్మి, జడ్జ్ ఇంద్రజలని ఆహ్వానించారు. రైల్వే ట్రాక్‌పై ఎంటర్టైన్‌ చేయాల్సి ఉంటుంది. ఇది చూసిన రష్మి గౌతమ్‌.. పట్టాలేంటి, ట్రైన్‌ ఏంటి, ట్రాక్‌ ఏంటి? నేను ఈ ట్రాక్‌పై నిల్చోలేను అని చెబుతుంది రష్మి. దీంతో అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చాడు రామ్‌ ప్రసాద్‌. అమ్మా మర్చిపోయావా తొమ్మిదేళ్లు ఒకే ట్రాక్‌ నడిపించావు. ఇప్పుడు రెండు గంటలు కూడా ఉండలేవా అని కౌంటర్‌ వేశాడు రామ్‌ ప్రసాద్‌. అంద‌రు కూడా సుధీర్ గురించి ఇలా ఇన్‌డైరెక్ట్‌గా మాట్లాడి ఉంటాడు అని ముచ్చ‌టించుకుంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది