Anchor Rashmi Gautam : మాటల్లో చెప్పలేక కన్నీరు పెట్టేసుకుంది.. సుధీర్ పై యాంకర్ రష్మీ ఎమోషనల్.. వీడియో

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 31 August 2021, 8:05 pm

Anchor Rashmi Gautam జబర్దస్త్ యాంకర్‌గా ఎంట్రీ ఇవ్వకముందు రష్మీ Anchor Rashmi Gautam పేరు కూడా ఎవ్వరికీ తెలిసిందే. అసలు ఆమె అంటూ ఉందని కూడా ఎవ్వరూ గుర్తు పట్టేశారు కాదు. అప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నా, కొన్ని చిత్రాలు చేసినా కూడా రష్మీని ఎవ్వరూ గుర్తు పట్టలేదు.

Anchor Rashmi Gautam Cried in Extra Jabardasth 350th promo

Anchor Rashmi Gautam Cried in Extra Jabardasth 350th promo

కానీ ఒక్కసారి జబర్దస్త్ స్టేజ్ ఎక్కిన తరువాత రష్మీ ఫేట్ మారిపోయింది. అప్పటి వరకు తాను పడ్డ కష్టాలన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. అలా రష్మీ జబర్దస్త్ యాంకర్‌గా నేటికీ మంచి ఫాంలోనే ఉంది.జబర్దస్త్ యాంకర్‌గా ఫేమస్ అయిన రష్మీ Anchor Rashmi Gautam మొదట్లో తెలుగు రాక ఇబ్బంది పడింది. కానీ ఇప్పుడు పర్వాలేదనిపించుకుంటోంది. తెలుగులో అనర్గళంగా మాట్లాడలేకపోయినా మ్యానేజ్ చేయగలుగుతోంది

 

Anchor Rashmi Gautam Cried in Extra Jabardasth 350th promo

Anchor Rashmi Gautam Cried in Extra Jabardasth 350th promo

మాటల్లో చెప్పలేక కన్నీరు పెట్టేసుకుంది.. యాంకర్ రష్మీ ఎమోషనల్ Anchor Rashmi Gautam

. అలా రష్మీ ఇప్పుడు బుల్లితెరపై స్టార్‌గా మారింది. సిల్వర్ స్క్రీన్ మీద హీరోయిన్‌గానే చేసింది. అయితే రష్మీ తన కష్టాల గురించి చెప్పుకోలేక ఎమోషనల్ అయినట్టు కనిపిస్తోంది. ఈ వారం ఎక్స్ ట్రా జబర్దస్త్ షో 350వ ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. ఈ క్రమంలో జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు వారు పడ్డ కష్టాలనే స్కిట్ల రూపంలో చూపించేశారు.

Anchor Rashmi Gautam Cried in Extra Jabardasth 350th promo

Anchor Rashmi Gautam Cried in Extra Jabardasth 350th promo

 

ఈ క్రమంలో సుధీర్, గెటప్ శ్రీనుల కష్టాల గురించి కార్తీక్ స్కిట్ వేశాడు.అనంతరం ఆ స్కిట్ గురించి, మీ పర్సనల్ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పమని రష్మీని కార్తీక్ అడిగేశాడు. దానికి మాటలు రాక మూగబోయినట్టుగా రష్మీ కంటనీరు పెట్టేసుకుంది. లోపలి నుంచి వస్తోన్న కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించింది. మరి రష్మీ తన కష్టాల గురించి ఏం చెబుతుందో చూడాలి.

 

Cinema Desk

No bio available for this author.

Tags :
    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
    WhatsApp