Sudheer And Getup Srinu : కష్టాల కడలి కళ్లకు కట్టినట్టు.. గతంలో గెటప్ శ్రీను, సుధీర్
Sudheer And Getup Srinu : జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు ఇప్పుడు అయితే రాజభోగాలు అనుభవిస్తున్నారు. కార్లు, ఫ్లాట్లు అన్నీ కొనుక్కుంటున్నారు. సమాజంలో వారికంటే స్టార్ స్టేటస్ వచ్చింది. కానీ ఒకప్పుడు ఒక్క పూట అన్నం కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చింది. రోజుకు ఒక్క పూట తిన్నా చాలు అనుకున్న రోజులున్నాయి. ఇక అలా తినకుండా ఎన్నో రోజులు గడిపిన క్షణాలు కూడా ఉన్నాయి. వాటి గురించి జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు ఎన్నో సార్లు ఎన్నో వేదికలపై చెప్పుకొచ్చారు. తాజాగా మరోసారి వారి కష్టాలను జబర్దస్త్ స్టేజ్ మీద ఆవిష్కరించారు.
Sudheer And Getup Srinu : ఎక్స్ ట్రా జబర్దస్త్ షో రేర్ ఫీట్‌ను సాధించింది. 350వ ఎపిసోడ్కు చేరుకున్న సందర్భంగా స్పెషల్‌గా ప్లాన్ చేసింది. స్పెషల్ స్కిట్లు వేసింది. ఆర్టిస్ట్‌లు తమ కుటుంబ సభ్యులను తీసుకొచ్చారు. పర్ఫామెన్స్ చేయించారు. అలా ఆర్టిస్ట్‌లు తమ జీవితంలోని కష్టాలను తెలియజెప్పేలా స్కిట్లు వేశారు. అందులో భాగంగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనుల కష్టాల కడలిని కళ్లకు కట్టినట్టు చూపించారు. సుధీర్‌లా కార్తీక్, గెటప్ శ్రీనులా ఇమాన్యుయేల్ నటించారు.
Sudheer And Getup Srinu : కష్టాల కడలి కళ్లకు కట్టినట్టు.. గతంలో గెటప్ శ్రీను, సుధీర్ :
జబర్దస్త్‌కు రాకముందు వారి లైఫ్ ఎలా ఉండేదో చూపించారు. అప్పటికే వారు తినకుండా ఉండి మూడు రోజులు అవుతోంది. ఒకరొనొకరు ఆకలి అవుతుందా? అని అడుక్కుంటారు. సుధీర్ ఎక్కడ బాధపడతాడో అని శ్రీను, శ్రీను ఎక్కడ బాధపడతాడో అని సుధీర్.. ఆకలి అవ్వడం లేదని అబద్దాలు చెప్పి పడుకుంటారు. కానీ ఆకలిలో అలమటిస్తుంటారు. అది భరించలేక రోడ్డు పక్కన ట్యాపులో సుధీర్ నీళ్లు తాగుతాడు. ఒకరింట్లో ఉన్న చెట్టు మీది కాయను తెంపుకుని గెటప్ శ్రీను తినేస్తాడు ఇలా వారి కష్టాలను చూపెట్టేశారు.
