Karthik Deepam : అదే గీతా సారం.. డాక్టర్ బాబు మామూలోడు కాదు! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Karthik Deepam : అదే గీతా సారం.. డాక్టర్ బాబు మామూలోడు కాదు!

Karthik Deepam కార్తీకదీపం సీరియల్‌ Karthik Deepam లోని డాక్టర్ బాబు గురించి అందరికీ తెలిసిందే. అందులో ఆయన వేసే పంచ్‌లు, సెటైర్లు అందరూ వింటూనే ఉంటారు. అయితే ఇప్పుడు కార్తీక్, డాక్టర్ బాబు పాత్ర మాటలు, చేతలకు దూరంగా ఉంది. కేవలం ఓ బొమ్మలాంటి పాత్రను చేస్తున్నారు. చివరకు మోనిత.. డాక్టర్ బాబును కట్టిపడేసి బంధించేస్థాయికి వెళ్లిపోయింది. కార్తీక్ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయాడు. అలా కార్తీకదీపం రోజుకో మలుపు తిరుగుతూ ముందుకు పోతోంది. […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :31 August 2021,4:30 pm

Karthik Deepam కార్తీకదీపం సీరియల్‌ Karthik Deepam లోని డాక్టర్ బాబు గురించి అందరికీ తెలిసిందే. అందులో ఆయన వేసే పంచ్‌లు, సెటైర్లు అందరూ వింటూనే ఉంటారు. అయితే ఇప్పుడు కార్తీక్, డాక్టర్ బాబు పాత్ర మాటలు, చేతలకు దూరంగా ఉంది. కేవలం ఓ బొమ్మలాంటి పాత్రను చేస్తున్నారు. చివరకు మోనిత.. డాక్టర్ బాబును కట్టిపడేసి బంధించేస్థాయికి వెళ్లిపోయింది. కార్తీక్ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయాడు. అలా కార్తీకదీపం రోజుకో మలుపు తిరుగుతూ ముందుకు పోతోంది.

Karthik Deepam Nirupam On krishnastami

Karthik Deepam Nirupam On krishnastami

అదే గీతా సారం.. డాక్టర్ బాబు మామూలోడు కాదు! Karthik Deepam

అయితే డాక్టర్ బాబు, కార్తీక్ పాత్రల్లో నిరుపమ్ తెరపై ఎలా ఉంటాడో.. తెర వెనుక దానికి భిన్నంగా ఎంతో సరదాగా ఉంటాడు. అలాంటి నిరుపమ్ సోషల్ మీడియాలో వేసే పంచ్‌లు, సెటైర్లు మామూలుగా ఉండవు. స్వతాహాగా రైటర్ అవ్వడంతో ప్రాసల్లో మంచి గ్రిప్ ఉన్నట్టుంది. ఆయన పెట్టే కొటేషన్లు, చేసే కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా ఆయన వేసిన ఓ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. కృష్ణాష్టమి సందర్భంగా డాక్టర్ బాబు కన్నయ్యలా మారిపోయాడు.

Karthik Deepam Nirupam On krishnastami

Karthik Deepam Nirupam On krishnastami

రాధాకృష్ణుడిలా మంజులా నిరుపమ్ పోజులు పెట్టేశారు. ఏదో ఒక ఈవెంట్‌లో అలా పోజులు పెట్టిన ఫోటోను జన్మాష్టమి సందర్భంగా షేర్ చేస్తూ.. గీతా సారం గురించి చెప్పాడు. కృష్ణుడు చెప్పింది తనలా ఉండమని కాదు.. తను చెప్పింది ఫాలో అవ్వమని.. అదే గీతా సారం.. అందరికీ కృష్ణుడి బర్త్ డే శుభాకాంక్షలు అని తన స్టైల్లో నవ్వులు పూయించాడు. మొత్తానికి డాక్టర్ బాబు కాస్తా రైటర్ బాబు అనిపించుకునేలా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన వేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

Karthik Deepam Nirupam On krishnastami

Karthik Deepam Nirupam On krishnastami

 

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది