Anchor Ravi : వాటిని కూడా వదలడం లేదా?.. అషూ రెడ్డి పరువుతీసిన యాంకర్ రవి

Authored By Cinema Desk | The Telugu News | Published on: January 20, 2022, 8:30 pm

Anchor Ravi : యాంకర్ రవి అషూ రెడ్డి మధ్య ఎప్పుడూ ఏదో ఒక కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. ఈ ఇద్దరూ ఇప్పుడు హ్యాపీ డేస్ షోతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. మధ్యలో రవి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లినప్పుడు ఆ షో కొన్ని రోజులు ఆగిపోయింది. మధ్యలో యూట్యూబర్ నిఖిల్‌ను తీసుకొచ్చారు. కానీ అంతగా వర్కవుట్ అవ్వలేదు. దీంతో మళ్లీ రవినే ఆ షో పగ్గాలు పట్టుకున్నాడు.

మళ్లీ రవి ఎంట్రీ ఇచ్చాక, అషూతో కలిసి ఆ షోను నడిపించేస్తున్నాడు. ఈ ఇద్దరూ ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్‌లో చేసే ఫన్ ఎక్కువగా ఉంటుంది. షూటింగ్ లేకుండా సెట్‌లో ఖాళీగా ఉన్న సమయాల్లో ఈ ఇద్దరూ ఒకరి వీడియో ఒకరు తీసుకుంటూ వాటికి ఫిల్టర్లు యాడ్ చేసి నానా హంగామా చేస్తుంటారు. ఇక అషూ రెడ్డి చేసే వింత ఫోటో షూట్ల మీద రవి సెటైర్ల మీద సెటైర్లు వేస్తుంటాడు.

Anchor Ravi About Ashu Reddy Using Set Properties

Anchor Ravi About Ashu Reddy Using Set Properties

Anchor Ravi : అషూ ఫోటో షూట్.. రవి సెటైర్లు..

తాజాగా అషూ చేసిన వెరైటీ ఫోటో షూట్ మీద కౌంటర్లు వేశాడు. అబ్రకదబ్ర అంటూ సెట్‌లో ఉన్న ప్రాపర్టీలను వాడి ఫోటో షూట్ చేసింది. దీనిపై కౌంటర్లు వేస్తూ అషూ పరువుతీసేశాడు రవి. సెట్ ప్రాపర్టీస్‌ను కూడా వదలవా? అని యాంకర్ రవి అనేశాడు. అవి కూడా మనవే కదా? అని అషూ రెడ్డి రివర్స్ పంచ్ వేసింది. మొత్తానికి అషూ ఫోటో షూట్ మాత్రం నెట్టింట్లో ఫన్ క్రియేట్ చేస్తోంది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp