Anchor Shyamala : ఆ పని చేయడమే నాకు ఇష్టం.. యాంకర్ శ్యామల పోస్ట్
Anchor Shyamala : యాంకర్ శ్యామల గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బుల్లితెర, వెండితెరపై మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా పాపులారిటీ పెంచుకుంటుంది. ఇటీవలి కాలంలో యాంకర్ శ్యామల తెగ సందడి చేస్తుంటుంది. శ్యామల ఒకప్పుడు సీరియల్స్‌తో మంచి ఆదరణను దక్కించుకుంది. ఆ తరువాత ఆమె ఇతర షోలు, ఎంటర్టైన్మెంట్ షోల వైపు వెళ్లింది. నటిగా శ్యామల కెరీర్‌ను మొదలుపెట్టినా కూడా యాంకర్‌గా మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. వంటల షోలతో శ్యామల బాగానే ఫేమస్ అయింది. సీరియల్ నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యాంకర్ శ్యామల..

Anchor Shyamala prepares variety chicken
‘లయ’, ‘అభిషేకం’, ‘గోరింటాకు’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ వంటి సీరియల్స్‌లో నటించి పేరు సంపాదించుకుంది.‘మా ఊరి వంట’, పట్టుకుంటే పట్టుచీర తదితర కార్యక్రమాలతో యాంకర్‌గా సత్తా చాటింది. సినిమా ఈవెంట్లు, మూవీ ప్రమోషన్స్ ఇంటర్వ్యూలలో తరచుగా కనిపించే శ్యామల.. సోషల్ మీడియాలోనూ సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తనకు గోంగూర చికెన్ చేయడం అంటే చాలా ఇష్టం అని తెలిపింది. ఆమె పెట్టిన పోస్ట్ చూసిన నెటిజన్స్ తెగ నోరూరుతుంది అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇటీవల ఓ నెటిజన్ శ్యామలకి కాస్త నాటీ ప్రశ్నను వేశాడు. ఇషాన్ ఆడుకోవడానికి ఓ చెల్లిని ఇవ్వొచ్చు కదా? అని అడిగేశాడు.

Anchor Shyamala prepares variety chicken
Anchor Shyamala : శ్యామలనా, మజాకానా..
దానికి శ్యామల అదిరిపోయే రిప్లై ఇచ్చింది. ఓరీ దేవుడా? అన్నట్టుగా నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేసింది. మొత్తానికి యాంకర్ శ్యామల మాత్రం నెటిజన్లకు ఇచ్చిన సమాధానాలు బాగానే వైరల్ అవుతున్నాయి. ఇటీవల వర్మ కూడా శ్యామలని చాలా వెరైటీగా స్పందించాడు. అతని ప్రశంసలకు తెగ సిగ్గుపడింది శ్యామల. ఇదిలాఉంటే.. కాకినాడ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శ్యామల.. సీరియల్ నటుడు నరసింహరెడ్డి ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల శ్యామల భర్త నరసింహ.. ఓ మహిళను మోసం చేసిన ఛీటింగ్ కేసులో జైలుకు వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది.