Anchor Shyamala : నాపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేశా.. యాంకర్ శ్యామల..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchor Shyamala : నాపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేశా.. యాంకర్ శ్యామల..!

 Authored By ramu | The Telugu News | Updated on :22 May 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Anchor Shyamala : నాపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేశా.. యాంకర్ శ్యామల..!

Anchor Shyamala : యాంకర్ శ్యామల ఈ మధ్య నిత్యం ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఆమె మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇచ్చింది. కొందరు వైసీపీ నేతల తరఫున ప్రచారం కూడా చేసింది. అందుకు ఆమె ఏం ఆశించిందో ఎవరికీ తెలియదు. అయితే శ్యామల ఇలా వైసీపీకి సపోర్టు చేయడంతో చాలా మంది ప్రతిపక్ష వర్గాలు ఆమెపై తీవ్రంగా మండిపడ్డాయి. ఆమెను చాలా టార్గెట్ చేశాయి. ఇక టీడీపీ, జనసేనకు చెందిన ఓ వర్గం అయితే ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది. దాంతో ఆమె నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉండిపోయిందని చెప్పుకోవాలి.

ఇదిలా ఉండగా మొన్న ఆదివారం నాడు బెంగుళూరులో రేవ్ పార్టీ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో చాలా మంది తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నారనే ప్రచారం జరిగింది. ముందుగా నటి హేమ, హీరో శ్రీకాంత్, జానీ మాస్టర్ పేర్లు బలంగా వినిపించాయి. అయితే తాను ఆ పార్టీలో లేనంటూ హీరో శ్రీకాంత్ ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. అటు నటి హేమ కూడా ముందుగా తాను ఆ పార్టీలో లేనని చెప్పింది. కానీ చివరకు అడ్డంగా దొరికిపోయింది. ఆ పార్టీలో ఆమె కూడా ఉందని పోలీసులే స్వయంగా చెప్పారు. కానీ జానీ మాస్టర్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.

Anchor Shyamala స్పందించిన శ్యామల..

ఇక యాంకర్ శ్యామల కూడా ఈ పార్టీలో ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఎక్కువగా టీడీపీ కూటమికి చెందిన ఓ వర్గం బాగా ప్రచారం చేసింది. దాంతో ఈ ప్రచారంపై యాంకర్ శ్యామల ఘాటుగా స్పందిచింది. ఆమె మాట్లాడుతూ తనపై తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేశానని తెలిపింది. తాను ఇప్పటి వరకు అలాంటి పార్టీలకు వెళ్లలేదని.. వెళ్లే అలవాటు కూడా లేదంటూ స్పష్టం చేసింది.

Anchor Shyamala నాపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేశా యాంకర్ శ్యామల

Anchor Shyamala : నాపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేశా.. యాంకర్ శ్యామల..!

కావాలనే కొందరు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని మండిపడింది శ్యామల. తనపై వస్తున్న ఫేక్ న్యూస్ ను నమ్మొద్దని స్పష్టం చేసింది. దాంతో ఆమె ఆ పార్టీలో లేదని క్లారిటీ వచ్చేసింది. కాగా ఇప్పటి వరకు ఆ పార్టీలో ఎవరున్నానేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. చాలా మంది పేర్లు వినిపిస్తున్నా ఎవరూ పెద్దగా స్పందించట్లేదు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది