Anchor Shyamala : యాంక‌ర‌మ్మ చ‌ల్ల‌బ‌డిందిగా.. దిగొచ్చి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchor Shyamala : యాంక‌ర‌మ్మ చ‌ల్ల‌బ‌డిందిగా.. దిగొచ్చి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిందిగా..!

 Authored By ramu | The Telugu News | Updated on :7 June 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Anchor Shyamala : యాంక‌ర‌మ్మ చ‌ల్ల‌బ‌డిందిగా.. దిగొచ్చి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిందిగా..!

Anchor Shyamala : ఏపీ సార్వత్రిక ఎన్నికల వేళ చాలా మంది సెలబ్రిటీలు ప్రచారంలో పాల్గొన‌డం మ‌నం చూశాం. కొంద‌రు వైసీపీకి సపోర్టుగా క్యాంపెయిన్ నిర్వహించారు. మరికొంద‌రు కూట‌మికి సపోర్ట్ చేశారు. అయితే వైసీపీకి స‌పోర్ట్ చేస్తూ ప్ర‌చారం చేసిన వారిలో యాంక‌ర్ శ్యామ‌ల ఉన్నారు. ఆమె వైసీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించడంతో పాటు టీడీపీ, పవన్ కల్యాణ్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మైకు పట్టుకుని ఆవేశ పడటం తప్ప.. పవన్ కల్యాణ్ ఎవరికీ సాయం చేయలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. పిఠాపురంలో వంగ గీత గెలుపును ఆపే సత్తా పవన్ కల్యాణ్ కు లేదంటూ తీవ్ర విమర్శలు చేసింది.ఏప్రిల్ 11న నెల్లూరులో మొదలైన ఆమె ప్రచారం నెల రోజుల పాటు కొనసాగి మే 11న మళ్లీ నెల్లూరులోనే ముగిసింది.

Anchor Shyamala శ్యామ‌ల స్పంద‌న ఇదే..

అయితూ శ్యామ‌ల ప్రచారం చేసిన అన్ని చోట్లా వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఘోర పరాభవాన్ని చవి చూడటం విశేషం. ఇక ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీకి, జగన్‌కు సపోర్ట్‌గా ఎన్నో వీడియోలు పోస్ట్ చేసింది. కానీ ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ని వీడియోలు కనిపించడం లేదు. చాలావరకు డిలీట్ చేసింది. అంతే కాకుండా ఉన్న వీడియోలకు, ఫోటోలకు కూడా కామెంట్స్ ఆప్షన్‌ను తీసేసింది. దీంతో శ్యామలా ఏమైపోయింది, ఎందుకు సైలెంట్ అయ్యింది అంటూ ఇతర పార్టీ సపోర్టర్స్ తనను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. పిఠాపురంలో వంగా గీతనే గెలుస్తుందని అంత నమ్మకంగా చెప్పిందని, మరి ఇప్పుడు ఏమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు. వైసీపీకి అంతలా సపోర్ట్ చేసినందుకు శ్యామలా కెరీర్‌పై కూడా ఎఫెక్ట్ పడే అవ‌కాశం ఉంద‌ని కొంద‌రు అంటున్నారు.

Anchor Shyamala యాంక‌ర‌మ్మ చ‌ల్ల‌బ‌డిందిగా దిగొచ్చి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిందిగా

Anchor Shyamala : యాంక‌ర‌మ్మ చ‌ల్ల‌బ‌డిందిగా.. దిగొచ్చి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిందిగా..!

అయితే రిజ‌ల్ట్స్ వ‌చ్చాక తొలిసారి శ్యామ‌ల వీడియో విడుద‌ల చేసింది. ఏపీ ప్ర‌జ‌లంద‌రికి న‌మ‌స్కారం. మొన్నటి ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నా.. క‌చ్చితంగా ఎన్నికల క్షేత్రంలో ప్రజల తీర్పే అంతిమం.. ఈ ఎన్నికల్లో అఖండ విజ‌యం సాధించిన వారికి ధ‌న్య‌వాదాల‌లు. కూటమి పెద్దలు శ్రీ చంద్ర‌బాబు నాయుడు గారికి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారికి, బీజేపీ పెద్దలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు. అలాగే ఈ ఎన్నికల్లో మా పార్టీ వైసిపి గెలుపు కోసం అహర్నిశలు పని చేసిన వైసిపి కుటుంబ సభ్యుల‌కి పేరు పేరున‌ ధన్యవాదాలు. ఇక్క‌డ ఒక‌టి గుర్తు పెట్టుకోవాలి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం గెలిచిననాడు పొంగిపోలేదు ఓడిన నాడు కుంగిపోము మల్లి పుంజుకొని మా నాయకుడు జగన్ అన్న ఆధ్వర్యంలో తిరిగి స‌రికొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఇక త‌న‌కు వ‌చ్చే కాల్స్ పై కూడా స్పందించింది. ఏది వ్య‌క్తిగ‌తంగా తీసుకోవ‌ద్దు. పార్టీకి సాయం చేసే విధంగా ఉన్న‌దే చెప్పాను. ద‌య‌చేసి దానిని ఎవ‌రు త‌ప్పుగా అనుకోవ‌ద్దు అని శ్యామ‌ల పేర్కొంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది