Sreemukhi : సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న శ్రీముఖి .. లీక్ చేసిన టాప్ యాంకర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreemukhi : సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న శ్రీముఖి .. లీక్ చేసిన టాప్ యాంకర్..!

 Authored By aruna | The Telugu News | Updated on :8 August 2023,8:00 pm

Sreemukhi : బుల్లితెరపై స్టార్ యాంకర్లలో ఒకరిగా శ్రీముఖి కొనసాగుతుంది. మొదటగా శ్రీముఖి యాంకర్ రవితో కలిసి పటాస్ షో చేసింది. ఆ షో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ షో ద్వారా శ్రీముఖి రాములమ్మగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత పలుషోలు చేస్తూ ఫుల్ పాపులర్ అయింది. అలాగే రియాలిటీ షో బిగ్ బాస్ షో ద్వారా శ్రీముఖి మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం బుల్లితెర షోలను హోస్టుగా వ్యవహరిస్తూ బిజీగా గడుపుతుంది. అలాగే అప్పుడప్పుడు సినిమాలలో కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘ భోళా శంకర్ ‘ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.

ఇక శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని హాట్ ఫొటో షూట్ లు కూడా చేస్తూ ఉంటుంది. అయితే శ్రీముఖి ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు కావస్తుంది. అయినా ఆమె ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. దీంతో సోషల్ మీడియాలో శ్రీముఖి పెళ్లిపై ఏదో ఒక వార్త ట్రెండ్ అవుతూ వస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో శ్రీముఖి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇటీవల భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీముఖి ఎంగేజ్మెంట్ గురించి హోస్ట్ సుమ వెల్లడించింది.

Anchor Sreemukhi marriage news

Anchor Sreemukhi marriage news

అయితే సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా శ్రీముఖి అలాగే చిరంజీవి కూడా నటిస్తున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీముఖి చిరంజీవి గురించి మాట్లాడింది. ఆ తర్వాత యాంకర్ సుమ నీకు పెళ్లి కుదిరింది కదా అని శ్రీముఖిని అడిగింది. దానికి బదులుగా శ్రీముఖి అలాంటిదేమీ లేదు అంటూ తప్పించుకొని ప్రయత్నం చేసింది. అయితే ఇది నిజమా కాదా తెలియాల్సి ఉంది. ఆ షోలో శ్రీముఖి పెళ్లి టాపిక్ రావడం అందరికీ డౌట్ రావడంతో అది నిజమేనేమో అని అనుకుంటున్నారు. మొత్తానికి శ్రీముఖి పెళ్లి గురించి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది