అది కనిపించడం లేదు.. దొరికితే ఇవ్వండి.. సుమ ఫన్నీ వీడియో వైరల్

Authored By Admin | The Telugu News | Updated on : 8 December 2020, 5:38 pm

యాంకర్ సుమ ఎంత సరదా మనిషో అందరికీ తెలిసిందే. అది తెర వెనుకైనా సరే తెర ముందైనా సరే. సుమకు నవ్వించడం మాత్రమే తెలుసు. ఇంత కాలం బుల్లితెరపై, సినిమా ఈవెంట్లలో పంచ్‌లు వేస్తూ నవ్వించే సుమ..ఈ మధ్య సోషల్ మీడియాలో నవ్వులుపూదోట పూయిస్తోంది. లాక్డౌన్ నుంచి సోషల్ మీడియాను సుమ రఫ్ఫాడిస్తోంది. ఇంట్లో ఎంత సరదాగా ఉంటుందో చెప్పేలా ఎన్నో వీడియోలను షేర్ చేసింది.

Anchor Suma About Iphone siri Video goes viral

Anchor Suma About Iphone siri Video goes viral

పని చేసే స్టాఫ్, మేకప్ మెన్స్, సెట్‌లో సుమ ఎలా ఉంటుందో చెబుతూ కొన్ని వీడియోలను సుమ షేర్ చేసింది. వీటిలో కరోనా వైరస్ పట్ల అవగాహన, మాస్క్‌లు ధరించాల్సిన ఆవశ్యకత, భౌతిక దూరం పాటించాల్సిన అవసరాలను చెబుతూ ప్రజలకు అవగాహన కల్పించే వీడియోలను ఎన్నో చేస్తూ వచ్చింది. మేకప్ రూంలో మేకప్ మేన్స్, ఇంట్లో అమ్మను, లిఫ్ట్‌లో పక్కింటి అబ్బాయిని, పూలమ్మే వ్యక్తితో సుమ చేసిన వాగ్వాదం చెప్పిన జాగ్రత్తలు, వాటికి సంబంధించిన వీడియోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

తాజాగా సుమ మరో ఫన్నీ వీడియోను షేర్ చేసింది. అందులో సిరి గురించి సుమ తాపత్రయ పడింది. తన ఐఫోన్‌లోని సిరి ఎక్కడికో వెళ్లిపోయిందట. ఐఫోన్‌లో సిరి అనే ఓ సాంకేతికత ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే తన యాపిల్ ఫోన్‌లో ఉండాల్సిన సిరి కనిపించడం లేదని సుమ వాపోయింది. ఎక్కడికి వెళ్లావే వంట చేయడానికి వెళ్లావా? నా సిరి కనిపించడం లేదు. దొరికితే తెచ్చివ్వరా అంటూ అభిమానులను అడిగింది. సుమ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Suma K (@kanakalasuma)

Admin

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp