Anchor Suma : రోబోతో ఆటలు.. విదేశాల్లో యాంకర్ సుమ సందడి

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: May 30, 2022, 8:20 am

Anchor Suma : యాంకర్ సుమ ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా నిర్విరామంగా షూటింగ్‌లతో బిజీగా ఉన్న సుమ ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అయితే ఫ్యామిలీతో సహా వెళ్లినట్టు కనిపించడం లేదు. తాను షేర్ చేస్తున్న ఫోటోలు, వీడియోల్లో సుమ మాత్రమే కనిపిస్తోంది. ఫ్యామిలీతో కలిసి ఈ ట్రిప్‌కు వెళ్లినట్టు అనిపించడం లేదు. సుమ ఈ మధ్య ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. షోలు, ఈవెంట్లు అంటూ చేస్తూనే తన సినిమాను కూడా ప్రమోట్ చేసుకుంది.

తన జయమ్మ పంచాయితీ సినిమా గురించి ఎంతగా తిరిగిందో అందరికీ తెలిసిందే. దగ్గరుండి సినిమా పనులన్నీ చూసుకుంది. వరంగల్, విజయవాడ, వైజాగ్ అంటూ టూర్లు కూడా వేసింది. అలా సుమ క్షణం తీరిక లేకుండా ఫుల్ బిజీగా మారింది. అసలే ఎప్పుడూ షూటింగ్‌లంటూ తిరిగే సుమకు ఇలా రెస్ట్ తీసుకోవడం ఎంతైనా అవసరం. మామూలుగా అయితే సుమ ఎప్పుడూ కూడా ఇలా షూటింగ్‌లకు బ్రేక్స్ ఇవ్వదు.

Anchor Suma About Robot Server In New york City

Anchor Suma About Robot Server In New york City

నిత్యం పని చేసుకుంటూనే ఉంటుంది. అన్ని ప్రోగ్రాంలను బ్యాలెన్స్ చేస్తుంటుంది. కానీ ఇప్పుడు మాత్రం సుమ న్యూయార్క్‌లో ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఆమె రోబో సర్వర్లను చూసి సంబరపడిపోయింది. రెస్టారెంట్లలో రోబోలు సర్వ్ చేస్తున్నాయని, వీటికి మాటలు వచ్చా అంటూ వాటిని చూపించింది. మొత్తానికి సుమ మాత్రం ఫుల్లుగా రిఫ్రెష్ అవుతోన్నట్టు కనిపిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Suma K (@kanakalasuma)

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp