Home » Entertainment » Anchor Suma Agrees The Fight With Rajiv
Entertainment

Anchor Suma : త‌న భ‌ర్త‌తో గొడ‌వ‌లు నిజ‌మే అని ఒప్పుకున్న యాంక‌ర్ సుమ‌

Authored By
Sam C
The Telugu News | Published on: April 26, 2022, 2:30 pm
Advertisement

Anchor Suma : బుల్లితెర‌పై ఉన్న స్టార్ యాంక‌ర్స్‌లో మోస్ట్ పాపుల‌ర్ యాంక‌ర్ సుమ‌. ప్రతి ఒక్క ఛానల్ లో తప్పకుండా సుమ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తుంటారు. అదేవిధంగా ఏ సినిమా ఈవెంట్ జరిగిన, ప్రీ రిలీజ్ వేడుక జరిగినా, అవార్డ్ ఫంక్షన్ జరిగినా అక్కడ తప్పనిసరిగా సుమ గొంతు వినపడాల్సిందే. ఈ విధంగా వరుస సినిమా ఈవెంట్స్, బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్న ఈమె జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా సుమ గ‌త కొద్ది రోజులుగా ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ సంద‌డి చేస్తుంది.

Advertisement

తాజాగా ఆలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మంలో పాల్గొంది.అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చిన సుమకు అలీ.. తన వ్యక్తిగత జీవితంపై పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు. ‘సంవత్సరం క్రితం వరకు నువ్వు రాజీవ్ విడిపోయారని..నువ్వు ఒక ఇంట్లో ఉంటున్నావని… అతను ఒక ఇంట్లో ఉంటున్నారని’ అంటూ అడిగే ప్రశ్న మనకు ప్రోమోలో కనిపిస్తుంది. దీనికి సుమ సమాధానం ఇస్తూ.. ఇద్దరి మధ్యలో గొడవలు అవ్వటం అనేది వాస్తవమే… ఈ 23 ఏళ్లలో ఎన్ని గొడవలు.. కానీ ఒకటి మత్రం నిజం.. భార్యభర్త విడాకులు తీసుకోవడం అనేది ఈజీనే.. కానీ ఓ తల్లిదండ్రులుగా ఇట్స్ డిఫికల్ట్ అన్నారు.

Anchor Suma agrees the fight with rajiv

Advertisement

Anchor Suma : నిజం ఒప్పేసుకుంది..

సుమ విషయానికి వస్తే.. సుమ మళయాళి అయినా పుట్టింది పెరిగింది హైదరాబాద్‌లోనే. సుమ తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్న సమయంలో దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన మేఘమాల సీరియల్ లో సుమ చేస్తుండగా రాజీవ్ కనకాలతో పరిచయం అయింది. 1999, ఫిబ్రవరి 10న వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. సుమ తెలుగు,మళయాళం,హిందీ, ఇంగ్లీష్ భాషాల్లో నాన్ స్టాప్‌గా మాట్లాడగలదు. పంచ్ వేయాలంటే సుమ తర్వాతే ఎవరైనా, ఏ స్టార్ హీరో ప్రిరిలీజ్ ఈవెంట్ అయినా.. సక్సెస్ మీట్ అయినా… ప్రెస్ మీట్ అయినా.. సరే యాంకర్‌గా సుమ ఉండాల్సిందే.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి