Health Benefits : అన్నం తిన్నప్పటికీ.. అప్పుడప్పుడూ నీరసంగా అనిపిస్తోందా.. అలాగే ముఖంపై అకస్మాత్తుగా మొటిమలు రావడం.. మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం తరచుగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలను మీరు తరచుగా ఎదుర్కొంటున్నట్లయితే.. మీ అలవాట్లలో చాలా మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని రకాల మూలకాలు శరీరాన్ని అనారోగ్యానికి గురి చేసే ముందు.. మిమ్మ ల్ని మీరు రక్షించుకోండి. ఆరోగ్యకరమైన శరీరాన్ని కల్గి ఉండండి. శరీరంలోని వ్యర్థాలను తొలగించుకోవడానికి సులభమైన మార్గాలను మనం ఇక్కడ తెలుసుకుందాం. దీనిని నిర్విషీకరణ పద్ధతి అంటారు. ఈ ప్రక్రియలో తేలిక పాటి ఆహారాన్ని తినాల్సి ఉంటుంది.
ఇలా చేయడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు. అంతే కాదండోయ్ శరీర శక్తిని కూడా పెంచుతుంది. కొలెస్ట్రాల్ లేదా డయాబెటిస్ వంటి సమస్యలు ఉండే… తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. మీ కొలెస్ట్రాల్, డయాబెటిస్ కూడా నియంత్రణలో ఉంటుంది.నమ్మకమైన, కల్తీ లేని ఆహార పదార్థాలకు మాత్రమే మన ప్రాధాన్యం ఇవ్వాలి. కల్తీ ఆహార పదార్థాలు తినడం వల్లే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఆర్గానిక్ ఉత్పత్తులు వాడండి. అవి వాడలేని వారు కల్తీ లేని ఉత్పత్తులనే నమ్మకం ఉన్న పదార్థాలను వాడండి. అలాగే చక్కెరకు వీలయినంత దూరంగా ఉండాలి. అధికంగా చక్కెర తీసుకోవడం… విషంతో సమానం. కాబట్టి వీలైనంత వరకు చక్కెర వాడకాన్ని తగ్గించుకోవాలి.
అలాగే తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలి. ప్రతిరోజూ దాదాపు 8 నుంచి 12 గ్లాసుల నీటిని తాగేలా ప్లాన్ చేసుకోండి. అలాగే గ్లాసు నిమ్మరసం తాగండ వల్ల కూడా శరీరంలో క్షార పరిమాణాన్ని పెంచుతుంది. నిమ్మరసం అద్భుతమైన డిటాక్స్ డ్రింక్ అని చెబుతుంటారు. అలాగే టీ, కాఫీలకు వీలయినంత దూరంగా ఉండండి. మరీ టీ, కాఫీలు తాగకుండా ఉండలేక పోతే.. రోజుకొకసారి మాత్రమే తాగండి. అలాగే శ్వాస వ్యాయామాలు తప్పుకుండా చేయండి. లోతుగా శ్వాస తీసుకోవడం… మెళ్లిగా వదలడం వంటివి చేయాలి. అంతే కాకుండా మీ శరీరంలో పేరుకుపోయిన కొన్ని రకాల టాక్సిన్లను బయటకు పంపించొచ్చు. ఇవన్నీ పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. నీరసం, మెటిమలు వంటివి మీ దరి చేరవు.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.