Anchor Suma : బుల్లితెరపై టీఆర్పీ స్టంట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. జనాలను పిచ్చోళ్లను చేయడమే పరమావధిగా పెట్టుకుంటారు. షోలో ఏదో జరిగినట్టు చూపించేస్తారు.. కొట్టేసుకుంటున్నట్టు.. ఇకపై షోలోకి వచ్చేది లేదంటూ.. నానా హంగామా చేస్తుంటారు. అయితే ఇవన్నీ టీఆర్పీ స్టంట్లేనని అందరికీ అర్థమైంది. జనాలు కూడా వాటిని లైట్ తీసుకోవడం ప్రారంభించేశారు.అయితే తాజాగా సుమ క్యాష్ షోకు సంబంధించిన ప్రోమో వచ్చింది. రచ్చ రవికి కాస్త పిచ్చి కూడా ఉంటుందని అంతా అంటుంటారు.
యాంకర్ సుమ అయితే ఎన్నో ఈవెంట్లు, ప్రోగ్రాంలలో పిచ్చ రవి అని కూడా పిలిచేసింది. అయితే రవి, సుమ మధ్య వచ్చే కామెడీ కూడా ఏమంతా అట్రాక్టివ్‌గా ఉండదు. ఇదే క్యాష్ షోకి ఇది వరకు ఎన్నో సార్లు వచ్చాడు రచ్చ రవి. తాజాగా మళ్లీ వచ్చాడు.ఈ సారి భద్రం, ఖయ్యుం, తాగుబోతు రమేష్, రచ్చ రవి కలిసి వచ్చారు. ఇందులో షో అంతా బాగానే నడిపించినట్టుంది. రచ్చ రవిని బాగానే కామెడీ కోసం వాడుకున్నారు. అయితే ప్రోమో చివర్లో మాత్రం ట్విస్ట్ ఇచ్చారు.
సుమకి, రచ్చ రవికి ఏదో పెద్ద గొడవే జరిగినట్టు చూపించారు. ఇన్ని సార్లు పిలిచావ్.. నన్ను ఎప్పుడైనా విన్నర్‌ని చేశావా? అని సుమని అనేస్తాడు రచ్చ రవి.నేను రికమండ్ చేస్తే ఇక్కడకు వచ్చావా? అని సుమ అంటుంది. అక్కడ నిల్చుని ఎంత మందికి నువ్ ఆన్సర్లు చెప్పలేదు అని సుమ మీద ఆరోపణలు చేస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్.. ప్రోమోల కోసం ఇలాంటివి చేస్తారా? ప్రతీ దొంగ నా అంటూ సుమ తెగ రెచ్చిపోతోంది. అయితే ఇదంతా కూడా టీఆర్పీ స్టంట్లు అని నెటిజన్లు పసిగట్టేస్తున్నారు.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.