Anchor Suma : హద్దులు మీరిన రచ్చ రవి.. ప్రతీ దొంగ నా ** అంటూ రెచ్చిపోయిన యాంకర్ సుమ

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: April 20, 2022, 9:30 pm

Anchor Suma : బుల్లితెరపై టీఆర్పీ స్టంట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. జనాలను పిచ్చోళ్లను చేయడమే పరమావధిగా పెట్టుకుంటారు. షోలో ఏదో జరిగినట్టు చూపించేస్తారు.. కొట్టేసుకుంటున్నట్టు.. ఇకపై షోలోకి వచ్చేది లేదంటూ.. నానా హంగామా చేస్తుంటారు. అయితే ఇవన్నీ టీఆర్పీ స్టంట్లేనని అందరికీ అర్థమైంది. జనాలు కూడా వాటిని లైట్ తీసుకోవడం ప్రారంభించేశారు.అయితే తాజాగా సుమ క్యాష్ షోకు సంబంధించిన ప్రోమో వచ్చింది. రచ్చ రవికి కాస్త పిచ్చి కూడా ఉంటుందని అంతా అంటుంటారు.

యాంకర్ సుమ అయితే ఎన్నో ఈవెంట్లు, ప్రోగ్రాంలలో పిచ్చ రవి అని కూడా పిలిచేసింది. అయితే రవి, సుమ మధ్య వచ్చే కామెడీ కూడా ఏమంతా అట్రాక్టివ్‌‌గా ఉండదు. ఇదే క్యాష్ షోకి ఇది వరకు ఎన్నో సార్లు వచ్చాడు రచ్చ రవి. తాజాగా మళ్లీ వచ్చాడు.ఈ సారి భద్రం, ఖయ్యుం, తాగుబోతు రమేష్, రచ్చ రవి కలిసి వచ్చారు. ఇందులో షో అంతా బాగానే నడిపించినట్టుంది. రచ్చ రవిని బాగానే కామెడీ కోసం వాడుకున్నారు. అయితే ప్రోమో చివర్లో మాత్రం ట్విస్ట్ ఇచ్చారు.

Anchor Suma Fires on Racha Ravi In Cash Promo

Anchor Suma Fires on Racha Ravi In Cash Promo

సుమకి, రచ్చ రవికి ఏదో పెద్ద గొడవే జరిగినట్టు చూపించారు. ఇన్ని సార్లు పిలిచావ్.. నన్ను ఎప్పుడైనా విన్నర్‌ని చేశావా? అని సుమని అనేస్తాడు రచ్చ రవి.నేను రికమండ్ చేస్తే ఇక్కడకు వచ్చావా? అని సుమ అంటుంది. అక్కడ నిల్చుని ఎంత మందికి నువ్ ఆన్సర్లు చెప్పలేదు అని సుమ మీద ఆరోపణలు చేస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్.. ప్రోమోల కోసం ఇలాంటివి చేస్తారా? ప్రతీ దొంగ నా అంటూ సుమ తెగ రెచ్చిపోతోంది. అయితే ఇదంతా కూడా టీఆర్పీ స్టంట్లు అని నెటిజన్లు పసిగట్టేస్తున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp