Anchor Suma : ముందు నుంచి నాకు డౌటే.. భాను శ్రీ పరువుతీసిన యాంకర్ సుమ

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: June 20, 2022, 10:00 am

Anchor Suma : భాను శ్రీ యాంకర్‌గా, నటిగా బుల్లితెరపై బాగానే క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ షో తర్వాత భాను శ్రీకి అవకాశాలు భారీగానే వచ్చాయి. డ్యాన్సర్‌గా భాను శ్రీకి మంచి పేరుంది. ఆమె బుల్లితెరపై చేసే డ్యాన్సులు వైరల్ అవుతుంటాయి. ఆయితే ఆమెను అందరూ ఏడిపిస్తుంటారు. ఆమె గొంతుపై సెటైర్లు వేస్తుంటారు. మగ గొంతులా ఉంటుందని, మగాడు అంటూ ఏడిపిస్తుంటారు. ఆమె ఢీ షోలోనూ ఆ మధ్య వచ్చినట్టుంది. కానీ ఆమె చేసే ఎక్స్ ట్రాలతో పక్కకి తప్పించాల్సి వచ్చింది. మొత్తానికి ఇప్పుడు భాను శ్రీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. బుల్లితెరపై కాకుండా ఇప్పుడు భాను శ్రీ వెండితెరపై నటిస్తోంది. నల్లమల సినిమా, ఏమున్నవే పిల్లా ఏమున్నవే అనే పాటతో భాను శ్రీ తెగ సందడి చేసింది.

ఎక్కడ చూసినా ఆమె పేరే, ఆ పాట కనిపించేది. వినిపించేది. ఇక ఇప్పుడు 10 క్లాస్ డైరీస్ అనే సినిమాలో కూడా నటించింది. అలా భాను శ్రీకి ఎక్కువగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ టీం అంతా కూడా సుమ క్యాష్ షోకు గెస్టుగా వచ్చింది. ఇందులో శ్రీరామ్, భాను శ్రీ, జెమిని సురేష్, రాము, రామారావు వంటి వారున్నారు. ఇక ఇందులో భాను శ్రీ ఎంట్రీనే వింతగా జరిగింది. ఆమెకు పాలు ఇచ్చి ఆమెను తన పోడియం వద్దకు వెళ్లమంది సుమ. ఆమె అలా నడుస్తుంటే.. శోభనం గదిలోకి పాలతో వెళ్లినట్టు అనిపించిందో ఏమో గానీ సుమ సెటైర్ వేసింది.

Anchor Suma Fun With Bhanu Sri In Cash SHow

Anchor Suma Fun With Bhanu Sri In Cash SHow

మరో సందర్భంలో భాను శ్రీ గొంతు మీద సెటైర్ వేసింది. ఆమెతో పాటను పాడించే సాహసం చేసింది. ఆ పాట విని శ్రీరామ్ ఉలిక్కి పడ్డాడు. వద్దు అంటూ ఆపేయమన్నాడు. ఇక ఇంకో సందర్భంలో సుమ ఓ టాస్క్ ఇచ్చింది. తన పిల్లాడు తప్పిపోయాడు.. ఒకరి తరువాత ఒకరు వచ్చి మీరే ఆ కొడుగ్గా నటించాలని సుమ అంటుంది. ఫస్ట్ రాము వస్తాడు.. ఆతరువాత శ్రీరామ్ వస్తాడు.. నేనే నీ కొడుకుని అంటారు. ఇక చివర్లో భాను శ్రీ వస్తుంది.. నేనే నీ కొడుకుని అని భాను శ్రీ అంటుంది. అవును నాకు ముందు నుంచి నీ మీద డౌటే..నువ్ కొడుకువే అని భాను శ్రీ పరువుతీసేస్తుంది యాంకర్ సుమ.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp