Anchor Suma : ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అలా చేస్తారట.. సింగర్ల పరువుదీసిన సుమ

Authored By Cinema Desk | The Telugu News | Published on: September 20, 2021, 9:00 pm

Anchor Suma : యాంకర్ సుమ ఎక్కడుంటే అక్కడంతా సందడి వాతావరణం ఉంటుంది. ఇక సుమ బుల్లితెరపై చేసే హల్చల్ అంతా ఇంతా కాదు. సుమ తన క్యాష్ షోను సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోయేలా చేస్తోంది. వచ్చే వారం 175వ ఎపిసోడ్‌ను సుమ గ్రాండ్‌గా ప్లాన్ చేసింది. ఈ స్పెషల్ ఎపిసోడ్‌కు మ్యూజిక్ డైరెక్టర్లను పిలిచింది. అందులో ఎస్వీ కృష్ణారెడ్డి, ఆర్పీ పట్నాయక్, కళ్యాణీ మాలిక్, రఘు కుంచె వంటి వారిని గెస్టులుగా పిలిచింది. ఇక వీరితోనూ సుమ ఓ రేంజ్‌లో ఆడుకుంది.

Anchor Suma Fun With RP Patnaik In Cash Show

Anchor Suma Fun With RP Patnaik In Cash Show

ఇందులో సుమ ఓ పాటల కచేరి పెట్టింది. ఆ మ్యూజిక్ డైరెక్టర్లంతా కూడా తన శిష్యులని బిల్డప్ ఇచ్చింది. తకిట తకిట అంటూ కింగ్ సినిమాలో బ్రహ్మానందంలా నటించేసింది. అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకు అనే పాటను సుమ తన స్టైల్లో పాడగా..

Anchor Suma Fun With RP Patnaik In Cash Show

Anchor Suma Fun With RP Patnaik In Cash Show

ఆర్పీ పట్నాయక్ మాత్రం ఒరిజినల్ పాటను పాడేశాడు. దాంతో సుమ కన్నీరు పెట్టుకుంది. నా శిష్యుడు నాకంటే బాగా పాడుతున్నాడు అంటూ ఎమోషనల్ అయింది. అయితే ఆ తరువాత ఆర్పీ పట్నాయక్ అదిరిపోయ్ పంచ్ వేశాడు.

Anchor Suma Fun With RP Patnaik In Cash Show

Anchor Suma Fun With RP Patnaik In Cash Show

Anchor Suma : మ్యూజిక్ డైరెక్టర్లను ఆడుకున్న సుమ

ఆ హార్మోనియం పెట్టెను తెరవకుండా.. ఏం చేయకుండా కూడా వాయించడం ఇక్కడే సుమ దగ్గరే నేర్చుకున్నాను అంటూ ఆర్పీ పట్నాయక్ అదిరిపోయే కౌంటర్ వేశాడు. దీంతో సుమకు బాగానే కాలినట్టుంది. ఆడియో ఫంక్షన్లలో మీ సింగర్లు మైక్ ఆన్ చేయకుండా..

Anchor Suma Fun With RP Patnaik In Cash Show

Anchor Suma Fun With RP Patnaik In Cash Show

పాడినట్టుగా బిల్డప్ ఇవ్వగా లేనిది.. నేను ఇలా వాయించలేనా? అంటూ అసలు గుట్టు విప్పింది. కొంత మంది లైవ్ పర్ఫామెన్స్ అని చెప్పి.. వెనకాల పాటను ప్లే చేస్తారు.. ముందుకు మాత్రం మైకును పట్టుకుని తామే లైవ్‌లో పాడుతున్నామన్నంత బిల్డప్ ఇస్తుంటారు. వారి గుట్టును సుమ బయట పెట్టేసింది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp