Anchor Suma Funny Counters on Lobo in Cash Promo
Anchor Suma : సుమ తన క్యాష్ షోతో ప్రతీ శనివారం ప్రేక్షకులందరినీ అలరిస్తుంటుంది. ఈ షో ఎన్నో రూపాంతరాలుగా మారి.. చివరకు ఇప్పుడున్న క్యాష్ షోగా వస్తోంది. మొదట్లో జీన్స్ అంటూ వచ్చేది. ఇప్పుడు క్యాష్ షోగా గత కొన్నేళ్ల నుంచి అలరిస్తూనే వస్తోంది. క్యాష్ షోలో ఇది వరకు వచ్చిన గెస్టులే వస్తుంటారు. ఇక ఈ వారం మాత్రం కాస్త కొత్త మొహాలనే పిలిచినట్టు కనిపిస్తోంది. బిగ్ బాస్ షో ద్వారా ఫేమస్ అయిన లోబో, ఉమాదేవీ, విశ్వలతో పాటుగా నటి సింధూరను పిలిచారు.
ఇక బిగ్ బాస్ ఇంట్లో లోబో, ఉమాదేవీ, విశ్వ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. విశ్వ సింపతీ ప్లే చేశాడని అందరూ అన్నారు. ఉమాదేవీ తన యారగెన్సీతో చెడ్డ పేరు తెచ్చుకుంది. అలా మొత్తానికి లోబోకి కాస్త మంచి పేరు వచ్చింది. లోబో ఉమాదేవీల ట్రాక్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి రొమాన్స్‌ను బిగ్ బాస్ ప్రేక్షకులు చూడలేకపోయారు. ఈ ఇద్దరి ట్రాక్ కామెడీ వరకే అయినా కూడా జనాలు తట్టుకోలేకపోయారు.
Anchor Suma Funny Counters on Lobo in Cash Promo
ఇక ఇప్పుడు క్యాష్ షో స్టేజ్ మీద కూడా అదే రొమాన్స్ చేశారు. ఈ షో అంతా మీ రొమాన్స్ చూడలేక చావాలి అంటూ సుమ కూడా కౌంటర్లు వేసింది. ఇక సుమ ఓ టాస్క్ ఇచ్చింది. తమ చెవిలో ఓ జంతువు పేరు చెబుతామని, దాన్ని యాక్ట్ చేసి చూపించాలి.. మిగతా వాళ్లు కనుక్కోవాలని అన్నారు. విశ్వకు కోతి అని చెప్పినట్టున్నారు. కోతిలా ఎగిరేందుకు విశ్వ తెగ ప్రయత్నించాడు. ఇక లోబో వంతు వచ్చింది.
లోబోకు పిచ్చి కుక్క అని ఇచ్చినట్టున్నారు. కుక్కలా చేసేందుకు లోబో కష్టపడ్డాడు. పక్క నుంచి సింధూర. కుక్కా?.. పిచ్చి కుక్కా? అని ఇలా అంటూనే ఉంది. అయినా లోబో చేస్తూనే ఉన్నాడు. ఇన్నిసార్లు మొహం మీదే కుక్క పిచ్చి కుక్క అనిపించుకుంటున్నావ్.. బుద్దిలేదా? ఆల్రెడీ ఆన్సర్ చెప్పింది కదా? అని లోబో గాలి తీసింది సుమ.
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంకి గట్టి బలం లభించబోతోంది.…
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావాలంటే, పాత తప్పులను పునరావృతం చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నా, సజ్జల…
Mahesh Babu ED notices : సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఈడీ నోటీసులు అనే వార్త అభిమానులనే…
Tomato Juice To Regrow Hair : కాలంలో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఎన్నో…
Magic Leaf : ఇది వంటకాలలో ఎంతో సువాసనను కలిగి ఉంటుంది. ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పురుషులకు పవర్…
Glowing Skin : ఈ రోజుల్లో అందంగా కనిపించాలంటే మేకప్ లు తీసేయాల్సిందే. చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన…
Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…
Shiva Puja Tips : పురాణాల ప్రకారం శివయ్య బోలా శంకరుడు అని అంటారు. ఆయనకు ఇంత కోపం వస్తుందో…
This website uses cookies.