#image_title
Sreeleela : ప్రస్తుతం శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తను ఇప్పుడు ట్రెండీ హీరోయిన్. అసలు ఒకే ఒక్క సినిమా పెళ్లి సందడితో ఇండస్ట్రీలో అత్యంత బిజీ హీరోయిన్ అయిపోయింది. ఆ సినిమా తర్వాత తనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. మామూలుగా కాదు. బీభత్సంగా అవకాశాలు వచ్చాయి. ఏ సినిమాలో చూసినా తనే హీరోయిన్ గా కనిపిస్తోంది. చివరకు భగవంత్ కేసరి సినిమాలోనూ తను బాలయ్య బాబుకు కూతురుగా నటించింది. ఇటీవల తన కొత్త సినిమా ఆదికేశవ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమతో చాలా సరదాగా మాట్లాడింది శ్రీలీల. ఆదికేశవ సినిమాలో వైష్ణవ్ తేజ్ హీరో. ఆ సినిమా నవంబర్ 10 న దీపావళి కానుకగా విడుదల కాబోతోంది. ఈసందర్భంగా యాంకర్ సుమ.. శ్రీలీలకు పలు ప్రశ్నలు వేసింది.
నీకు ఎవరు ఇష్టం.. ఈ సినిమా హీరోనా లేక నిర్మాతనా, శ్రీలీలతో ఏ బయోపిక్ చేయాలి అని అడుగుతుంది సుమ. ఆ తర్వాత నువ్వు ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో ఏ హీరోయిన్ బెస్ట్ అని అడుగుతుంది సుమ. దీంతో ఒక్కొక్కరి గురించి ప్రత్యేకంగా చెబుతాడు వైష్ణవ్. శ్రీలీల చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది. డ్యాన్స్ బాగా చేస్తుంది అంటూ పొగడ్తల్లో ముంచెత్తాడు వైష్ణవ్. శ్రీలీల తన హీరోల గురించి చెప్పు అంటుంది. రోషన్ డెడికేటెడ్, రవితేజ స్పాంటెనిటీగా ఉంటారు. వైష్ణవ్ తేజ స్వీటెస్ట్, బాలకృష్ణ అంటే పవర్ ఫుల్, పవన్ కళ్యాణ్ దైవత్వం, మహేశ్ బాబు స్వీటెస్ట్ హ్యూమన్, ఫ్యామిలీ మ్యాన్ అంటూ చెప్పుకొస్తుంది. నితిన్ వెరీ కైండ్ అంటుంది.
#image_title
హీరోయిన్స్ ను పెళ్లి చేసుకున్న జంటల పేర్లు చెప్పండి అని అడుగుతుంది సుమ. మహేశ్ బాబు, నమ్రత.. వరుణ్ తేజ్, లావణ్య, రాధిక, శరత్ కుమార్ అని చెబుతుంది శ్రీలీల. మనిషి బ్రెయిన్ ఏ ఏజ్ లో ఎదగడం ఆగిపోతుంది అని అడుగుతుంది సుమ. ఆ తర్వాత సుమ కొడుకు గురించి కూడా టాపిక్ వస్తుంది. నా కొడుకుతో ఎప్పుడు సినిమా తీస్తున్నావు అని అడుగుతుంది. దీంతో శ్రీలీలకు ఏం చెప్పాలో అర్థం కాదు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.