Home » Entertainment » Anchor Suma Funny Reel Goes Viral
Entertainment

Anchor Suma : ఇదెక్కడి కామెడీ రా బాబు.. యాంకర్ సుమను ఇలా చూస్తే పగలబడి నవ్వాల్సిందే

Authored By
aruna
The Telugu News | Published on: September 20, 2022, 5:30 pm
Advertisement

Anchor Suma : యాంకర్ సుమ అంటే.. అందరికీ తెలుసు. ఆమె వేసే కౌంటర్లు, నవ్వించే విధానం తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచంలో తెలుగు వాళ్లు ఏ మూలన ఉన్నా కూడా సుమను తలుచుకుంటారు. సుమ పేరు తెలుసుకుంటారు. అలా సుమ రేంజ్‌ ఖండఖండాలు దాటిపోయింది. దేశ విదేశాల్లోనూ ఈవెంట్లు చేస్తుంటుంది. ఇక ఆమె ఎంత బిజీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె చేసే అల్లరి, ఇచ్చే వినోదం మామూలుగా ఉండదు. ఇన్ని రోజులు ఆమె బుల్లితెర, వెండితెర ఈవెంట్లు అనేట్టుగానే ఉండేది. కానీ ఇప్పుడు ఆమెకు సోషల్ మీడియా బాగా అలవాటైనట్టుంది.

Advertisement

యూట్యూబ్, ఇన్ స్టాగ్రాం ద్వారా సుమ తన అభిమానులను అలరిస్తూ ఉంటుంది. సుమ చేసే ఫన్‌కు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. సుమ తన ఇంట్లోపెట్స్‌తో ఆడుకోవడం, తన స్టాఫ్‌తో చేసే ఫన్, తన పని మనిషితో కలిసి వేసే పంచ్‌లు మామూలుగా ఉండవు. అందరితోనూ సుమ ఎంతో సరదాగా ఉంటుంది. కరోనా నుంచి సుమ ఈ సోషల్ మీడియాను ఎక్కువగా వాడటం మొదలుపెట్టేసింది. ఇప్పుడు కూడా సుమ తన సోషల్ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తోంది. యాడ్స్, బ్రాండ్ అంబాసిడర్స్, ప్రొడక్ట్‌లను ప్రమోట్ చేయడం వంటి చేస్తూ బాగానే సంపాదిస్తుంటుంది. యూట్యూబ్ వీడియోల్లో సుమ ఎంత అల్లరి చేస్తుంటుందో అందరికీ తెలిసిందే.

Anchor Suma Funny Reel goes viral

Advertisement

రకరకాల వీడియోలను యూట్యూబ్‌లో వదులుతోంది. అందులో సుమ తన పర్సనల్ విషయాలను చెబుతూ ఉంటుంది. అందుకే ఆ వీడియోలన్నీ అంతగా వైరల్ అవుతుంటాయి. తాజాగా సుమ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసింది. సుమ మామూలుగా రీల్ వీడియోలు చేస్తుంటుంది. అందులో ఆమె తన స్టాఫ్, పని మనుషులతో వేసే స్టెప్పులు వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఆమె స్టెప్పులు వేయలేదు. చిన్న పిల్లలా తుమ్ములు తుమ్మేసింది. భయంకరంగా నవ్వేసింది. దానికి తగ్గట్టుగా ఆమె మేకప్ వేసుకుంది. పిచ్చి పిచ్చిగా రెడీ అయింది. అందరినీ నవ్వించేస్తోంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి