Anchor Suma : పంచాయతీ కోసం చెట్లల్లో, పుట్టల్లో తిరిగిన సుమ.. కష్టం మాములుగా లేనట్టుంది.. వీడియో
Anchor Suma: వేదిక ఏదైన సరే తన మాటలతో అందరిని పరవశింపజేసే యాంకర్ సుమ. ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ చిత్రంతో వెండితెరకి పరిచయమైన సుమ మళ్లీ 8 ఏళ్ల తర్వాత సినిమాలు చేయాలని అనుకుంది. ఇందులో భాగంగా ఆమె జయమ్మ పంచాయతీ అనే చిత్రం చేస్తుంది. విజయ్ కుమార్ దర్శకత్వంలో చిత్రం తెరకెక్కుతుండగా, ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులని ఫుల్ ఎంటర్‌టైన్ చేయనున్నట్టు తెలుస్తుంది. సుమ తలుచుకోవాలేగానీ ఎన్ని పాత్రలనైనా అవలీలగా పోషించేస్తుంది. ఎప్పుడూ కూల్‌గా నవ్వుతూ, నవ్విస్తూ, పంచులు వేస్తూ ఎదుటి వారిని నవ్వించే పనిలోనే ఉంటుంది.
జయమ్మ పంచాయతీ చిత్రానికి సుమ బాగానే కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. తాజాగా చిత్రానికి సంబంధించి మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇందులో సుమ చెట్లల్లో, రాళ్లల్లో తిరుగుతూ కనిపించింది. దట్టమైన అడవుల్లో కూడా సుమ చక్కర్లు కొట్టింది. చూస్తుంటే సినిమా కోసం బాగానే కష్టపడినట్టు అర్ధమవుతుంది. ఈసినిమా సుమకి మంచి పేరు తీసుకురావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. సుమ గతంలో ‘పవిత్ర ప్రేమ’, ‘చాలా బాగుంది’, ‘వర్షం’, ‘ఢీ’, ‘బాద్‌షా’ తదితర చిత్రాల్లో నటించారు. సుమారు 8 ఏళ్ల తర్వాత మరోసారి వెండితెరపై కనిపించనున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Anchor suma jayamma panchayati making video released
Anchor Suma : సుమ కష్టానికి ప్రతిఫలం దక్కుతుందా?
జయమ్మ పంచాయతీ ఫస్ట్ లిరికల్ సాంగ్ ను ‘నాచురల్ స్టార్ నాని’ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే జయమ్మ పంచాయతీ పేరుతో సెలబ్రెటిలతో సుమ తన సినిమాను ఆసక్తికరంగా ప్రమోట్ చేస్తున్నారు. రామ్ చరణ్,రానా, రాజమౌళి ఇలా పలువురు సెలబ్ర్రిటీలను తన సినిమా ప్రమోషన్స్‌కి వాడుకుంది సుమ. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల కానుండగా, ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
