Anchor Suma : బుల్లితెర పై సెన్సేషన్ క్రియేట్ చేసిన యాంకర్ సుమ. యాంకర్ అనే పేరు చెప్పగానే అందరికీ గుర్తు వచ్చే పేరు సుమ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సుదీర్ఘ కాలంగా యాంకర్ గా కొనసాగుతున్న సుమ టీవీ షో లు మాత్రమే కాకుండా పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లు మరియు ఇతర ఈవెంట్ల కు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉంటారు. ఆమె యొక్క సమయ స్ఫూర్తితో షో ని అద్భుతంగా నడిపిస్తుంది అంటూ ఇప్పటికే మంచి పేరు దక్కించుకున్నారు.అందుకే ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తూనే ఉంటాయి. పెద్ద హీరోల సినిమా ల ఈవెంట్స్ ఎక్కువగా ఆమె హోస్ట్ గా జరుపు కోవాలని భావిస్తారు.
కనుక ఆమెను భారీ మొత్తానికి బుక్ చేసుకోవాలని ఈవెంట్ మేనేజర్లు భావిస్తూ ఉంటారు. మూడు నాలుగు సంవత్సరాల క్రితం యాంకర్ సుమ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి లక్ష నుండి రెండు లక్షల రూపాయల వరకు పారితోషికం గా తీసుకుంటుంది అంటే అప్పట్లో గొప్పగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆమె పారితోషికం ఏకంగా ఏడు నుంచి తొమ్మిది లక్షలు పెరిగినట్లుగా సమాచారం అందుతోంది.ఇంత భారీ పారితోషికాన్ని ఏ హీరోయిన్ కూడా ఒక్క రోజు కాల్షీట్ కు తీసుకునే అవకాశమే లేదు. అలాంటిది యాంకర్ సుమ ఒక్క రోజు కాల్ షీట్ కి ఏకంగా ఆ స్థాయి పారితోషికాన్ని తీసుకుంటుంది అంటే ఆమె స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
వరుసగా బుల్లి తెరపై షో లు చేస్తున్న సుమ ఇప్పుడు వెండి తెరపై కూడా తెరంగేట్రం కు సిద్ధమైంది. జయమ్మ పంచాయతీ అనే సినిమా తో ఎంట్రీ ఇవ్వబోతున్న ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. అతి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు వీడియో లు ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. మలయాళం కు చెందిన సుమ తెలుగు లో స్టార్ హీరోయిన్ రేంజ్ ని అందుకుంది అంటే ఆమె ప్రతిభ కారణం అని చెప్పుకోవచ్చు. ప్రతిభ తో పాటు అదృష్టం కూడా కలిసి రావడం తో ఆమె కు సినిమా లు బుల్లి తెరపై అవకాశాలు వరుసగా వస్తున్నాయి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.