Anchor Suma : యాంకర్‌ సుమ మళ్లీ పెంచేసిందట… హీరోయిన్స్ కు ఏమాత్రం తక్కువ కాదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anchor Suma : యాంకర్‌ సుమ మళ్లీ పెంచేసిందట… హీరోయిన్స్ కు ఏమాత్రం తక్కువ కాదు

Anchor Suma : బుల్లితెర పై సెన్సేషన్ క్రియేట్‌ చేసిన యాంకర్ సుమ. యాంకర్ అనే పేరు చెప్పగానే అందరికీ గుర్తు వచ్చే పేరు సుమ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సుదీర్ఘ కాలంగా యాంకర్ గా కొనసాగుతున్న సుమ టీవీ షో లు మాత్రమే కాకుండా పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లు మరియు ఇతర ఈవెంట్ల కు కూడా హోస్ట్‌ గా వ్యవహరిస్తూ ఉంటారు. ఆమె యొక్క సమయ స్ఫూర్తితో […]

 Authored By himanshi | The Telugu News | Updated on :5 March 2022,1:00 pm

Anchor Suma : బుల్లితెర పై సెన్సేషన్ క్రియేట్‌ చేసిన యాంకర్ సుమ. యాంకర్ అనే పేరు చెప్పగానే అందరికీ గుర్తు వచ్చే పేరు సుమ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సుదీర్ఘ కాలంగా యాంకర్ గా కొనసాగుతున్న సుమ టీవీ షో లు మాత్రమే కాకుండా పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లు మరియు ఇతర ఈవెంట్ల కు కూడా హోస్ట్‌ గా వ్యవహరిస్తూ ఉంటారు. ఆమె యొక్క సమయ స్ఫూర్తితో షో ని అద్భుతంగా నడిపిస్తుంది అంటూ ఇప్పటికే మంచి పేరు దక్కించుకున్నారు.అందుకే ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తూనే ఉంటాయి. పెద్ద హీరోల సినిమా ల ఈవెంట్స్ ఎక్కువగా ఆమె హోస్ట్‌ గా జరుపు కోవాలని భావిస్తారు.

కనుక ఆమెను భారీ మొత్తానికి బుక్ చేసుకోవాలని ఈవెంట్ మేనేజర్లు భావిస్తూ ఉంటారు. మూడు నాలుగు సంవత్సరాల క్రితం యాంకర్ సుమ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి లక్ష నుండి రెండు లక్షల రూపాయల వరకు పారితోషికం గా తీసుకుంటుంది అంటే అప్పట్లో గొప్పగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆమె పారితోషికం ఏకంగా ఏడు నుంచి తొమ్మిది లక్షలు పెరిగినట్లుగా సమాచారం అందుతోంది.ఇంత భారీ పారితోషికాన్ని ఏ హీరోయిన్ కూడా ఒక్క రోజు కాల్షీట్‌ కు తీసుకునే అవకాశమే లేదు. అలాంటిది యాంకర్ సుమ ఒక్క రోజు కాల్ షీట్ కి ఏకంగా ఆ స్థాయి పారితోషికాన్ని తీసుకుంటుంది అంటే ఆమె స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

anchor suma remuneration for one pre release event

anchor suma remuneration for one pre release event

వరుసగా బుల్లి తెరపై షో లు చేస్తున్న సుమ ఇప్పుడు వెండి తెరపై కూడా తెరంగేట్రం కు సిద్ధమైంది. జయమ్మ పంచాయతీ అనే సినిమా తో ఎంట్రీ ఇవ్వబోతున్న ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. అతి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్ మరియు వీడియో లు ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. మలయాళం కు చెందిన సుమ తెలుగు లో స్టార్ హీరోయిన్ రేంజ్ ని అందుకుంది అంటే ఆమె ప్రతిభ కారణం అని చెప్పుకోవచ్చు. ప్రతిభ తో పాటు అదృష్టం కూడా కలిసి రావడం తో ఆమె కు సినిమా లు బుల్లి తెరపై అవకాశాలు వరుసగా వస్తున్నాయి.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది