Anchor Varshini శేఖర్ మాస్టర్ గత కొన్ని రోజులుగా తన ఫ్రెండ్స్ అందరినీ కూడా కలుస్తున్నాడు. తన కొలిగ్స్, తన పరిచయాలను ఉపయోగించుకుంటూ నిర్మాతగా మొదటి ప్రాజెక్ట్ టెర్రస్‌ను సక్సెస్ చేయాలని అనుకుంటున్నాడు. తన యూట్యూబ్ చానెల్ శేఖర్ స్టూడియోస్‌లో రాబోతోన్న టెర్రస్ సినిమా కోసం ఢీ మెంబర్స్ అందరినీ రంగంలోకి దించుతున్నాడు. ఆది, ప్రియమణి, పూర్ణ, గెటప్ శ్రీను ఇలా అందరినీ ప్రమోషన్‌కు వాడుతున్నాడు.
వారి వారి టెర్రస్ కథలను చెబుతున్నారు. చిన్నతనంలో ఎవరికైనా సరే టెర్రస్ గుర్తులు ఉంటాయి. అమ్మాయిలకు లైన్లు వేయడం, అబ్బాయిలను కొంటెచూపులు చూడటం వంటివి ఉంటాయి. అలా తాజాగా వర్షిణి కూడా తన లైఫ్‌లోని టెర్రస్ కథను చెప్పేసింది. కానీ అందరూ అనుకున్నట్టుగా లవ్ స్టోరీ అయితే కాదు. తన అన్న ఎంతో స్ట్రిక్ట్ అన్నది అందరికీ తెలిసిందే. ఎవ్వరైనా తన అక్క, చెల్లి జోలికి వస్తే కొట్టేసి వచ్చేవాడట. ఎప్పుడూ కూడా కర్ర చేతిలో పెట్టుకునేవాడట. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ చెప్పేసింది.
ఇక తన టెర్రస్ కథ చెబుతూ.. ప్రేమ కథలు ఏవీ లేవు గానీ వర్షం పడ్డప్పుడల్లా.. నేను, అక్కా ఇద్దరంకూడా అమ్మ చీరకట్టుకుని టెర్రస్ మీదకు వెళ్లి డ్యాన్సులు చేసేవాళ్లం. మమ్మల్ని చూసి పక్కింటి అమ్మాయిలు కూడా వచ్చేవారు. పోటీ పెట్టుకుని మరీ డ్యాన్సులు వేసేవాళ్లం. అలా చేయడం వల్ల చిన్నప్పుడే నాకు ఆస్తమా వచ్చేసింది. ఇక అప్పటి నుంచి అంతగా వర్షంలో డ్యాన్సులు వేయ లేదు అని అంది. శేఖర్ మాస్టర్ టెర్రస్ సినిమాకు వర్షిణి ఆల్ ది బెస్ట్ చెప్పింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.