Anchor Varshini : వ‌ర్షిణిని ఈ డ్రెస్‌లో చూసి పిచ్చెక్కిపోతున్న అభిమానులు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchor Varshini : వ‌ర్షిణిని ఈ డ్రెస్‌లో చూసి పిచ్చెక్కిపోతున్న అభిమానులు..!

 Authored By sandeep | The Telugu News | Updated on :25 April 2022,11:00 am

Anchor Varshini : బుల్లితెర‌పై అందాల దాడి చేసే ముద్దుగుమ్మ‌ల‌లో వ‌ర్షిణి ఒక‌రు. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటన.. అదిరిపోయే హోస్టింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ భామ.. ఎంతగానో ఫేమస్ అయింది. అదే సమయంలో అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటోంది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వర్షిణి..ఎప్ప‌టిక‌ప్పుడు సరికొత్త‌గా త‌న అందాల‌ను ప్ర‌జెంట్ చేస్తూ కుర్ర‌కారుకి పిచ్చెక్కిస్తుంటుంది. అటు టీవీ రియాలిటీ షోల తోనూ మరియు వెబ్ సిరీస్ ల తోనూ బిజీ బిజీగా అయిపోయింది వ‌ర్షిణి. మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలో కి అడుగుపెట్టిన వర్షిణికి తెలుగు ప్రేక్షకుల్లో బాగా ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే వర్షిణి సౌందరాజన్ మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో ఆకట్టుకున్న ఈ భామ.. అక్కడ అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది. ఈ క్రమంలోనే కొన్ని జాతీయ బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. అదే సమయంలో కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ నటించి మోడల్‌గా సూపర్ సక్సెస్ అయిపోయింది. ఇప్పటికే యాంకరింగ్ లో టాప్ లో ఉన్న అనసూయ, రష్మీ, శ్రీముఖి ల కంటే కూడ గ్లామర్ షో చేయడంలో ఎక్కువగా రెచ్చిపోతుంది.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ త‌న అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంటుంది.ఢీ షోతో బాగా పాపులారిటీ ద‌క్కించుకున్న వ‌ర్షిణి టీమ్ లీడర్స్‌లో ఒకరైనా హైపర్ ఆదికి జోడగా సంద‌డి చేసింది. ఆమె ప్లేస్‌లో దీపికా పిల్లి వచ్చి చేరింది.

Anchor Varshini glamorous looks are stunning

Anchor Varshini glamorous looks are stunning

Anchor Varshini : ఏమందం వర్షిణి..

దీంతో వర్షిణి ఓ షోలో అవకాశం కోల్పోయినా మరో షోలో తన టాలెంట్‌తో అదరగొడుతున్నందుకు అభిమానులు చాలా హ్యపీగా ఉన్నారు. కామెడీ షో లో తన ఎంట్రీ డాన్స్ తో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. అయితే ఇప్పుడు ఆ షో కూడా వ‌ర్షిణి నుండి దాటి వెళ్లింది. ప్ర‌స్తుతం వెబ్ సిరీస్‌లు చేస్తున్న‌ట్టుగా తెలుస్తుంది. శంభో శివ శంభో సినిమాలో చిన్న పాత్ర చేసిన వర్షినీ ఆ తర్వాత జాతీయ పురస్కారం గెలుచుకున్న చందమామ కథలు చిత్రం లో కూడా నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాత ఆమె లవర్స్ మరియు కాయ్ రాజా కాయ్ అలాగే బెస్ట్ యాక్టర్స్ వంటి సినిమాలలో కనిపించింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో స్టైలిష్‌గా క‌నిపించింది. బుట్ట‌బొమ్మ మాదిరిగా ఉన్నావు అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Varshini (@varshini_sounderajan)

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది