Anchor Varshini : యాంకర్ వర్షిణి ప్రేమలో ఉంది ఎవరితో అంటే?. ఇన్నాళ్లకు గుట్టురట్టు!

Advertisement

Anchor Varshini : యాంకర్ వర్షిణి పెళ్లి మీద, ప్రేమ వ్యవహారాల మీద ఎప్పుడూ ఏదో ఒక రూమర్ పుట్టుకొస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి యాంకర్ వర్షిణి ప్రేమ సంగతులు తెరపైకి వచ్చాయి. మొన్నటి వరకు హైపర్ ఆదితో వర్షిణి పెళ్లి అని వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఢీ షో డైరెక్టర్, మల్లెమాల టీం మెంబర్‌తో వర్షిణి ప్రేమాయణం సాగిస్తోందనే రూమర్ వచ్చింది. ఆదితో పెళ్లి రూమర్లు వర్షిణి వరకు వెళ్లాయి. నెటిజన్లు నేరుగా ఆమెను అడిగేశారు. వాటిపై వర్షిణి నోరు విప్పింది.

Advertisement

మీరు అంతా అనుకుంటున్నట్టుగా ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. అవన్నీ తప్పుడు వార్తలు.. ఈ ఫేక్ వార్తలు క్రియేట్ చేసే వారి ఆనందానికి నేను రియాక్ట్ అవ్వాలని అనుకోవడం లేదు కానీ.. ఇలా అందరూ అడుగుతున్నారని క్లారిటీ ఇస్తున్నా.. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు.. అవన్నీ రూమర్లే అని ఖండించింది వర్షిణి. దీంతో ఆమెకు ఆదికి మధ్య ఏం లేదని అందరికీ క్లియర్‌గా అర్థమైంది.

Advertisement
Anchor Varshini With Dhee Choreographer Abhi in Restaurant
Anchor Varshini With Dhee Choreographer Abhi in Restaurant

తాజాగా వర్షిణి మరోసారి ప్రేమ వార్తలతో తెరపైకి వచ్చింది. ఢీ కొరియోగ్రాఫర్ అభితో వర్షిణి కలిసి కనిపించింది. ఇక ఇద్దరూ రెస్టారెంట్లో కలిసి కనిపించారు. ఈ ఇద్దరూ సెల్ఫీకి పోజులు ఇచ్చారు. అంతే కాకుండా అభి ఈ ఫోటోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తే.. వర్షిణి సైతం రిప్లై ఇచ్చింది. తన స్టోరీలోనూ ఆ ఫోటోలను షేర్ చేసింది. అభి షేర్ చేస్తూ కింద లవ్ సింబల్‌ను కూడా పెట్టేశాడు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే రూమర్ పుట్టుకొచ్చింది. మరి దీనిపై వర్షిణి రియాక్ట్ అవుతుందా?లేదా? అన్నది చూడాలి.

Advertisement
Advertisement