Anchor Varshini : ఇలా కూడా ప్రమోషన్స్ చేయొచ్చు.. యాంకర్ వర్షిణి మామూల్ది కాదు!
Anchor Varshini యాంకర్ వర్షిణి Anchor Varshini ఇప్పుడు తెరకు దూరంగా ఉంది. ఉన్న ఒక్క షో కూడా మిస్ అయింది. కామెడీ స్టార్స్ షోలో శ్రీముఖి వచ్చి చేరింది. వర్షిణి బయటకు రావడం వెనుక ఎన్నో కారణాలున్నాయి. సినిమా ఆఫర్లు వస్తుండటంతో ఇలా వెనక్కి వచ్చేసిందంటూ వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎంత నిజముందో వర్షిణికే తెలియాలి. తాజాగా వర్షిణి ఓ వీడియోను వదిలింది.
ఇలా కూడా ప్రమోషన్స్ చేయొచ్చు.. యాంకర్ వర్షిణి మామూల్ది కాదు! Anchor Varshini
సమంత శాకుంతలం, సుమంత్ అలా మొదలైంది సినిమాల్లో వర్షిణికి అవకాశం వచ్చింది. శాకుంతలం సినిమా షూటింగ్ అయిపోయింది. ఇక అలా మొదలైంది మాత్రం మిగిలింది. మళ్లీ బుల్లితెరపైకి వర్షిణి వస్తుందా? లేదా? అన్నది తెలియదు. ఇక మొన్నటి వరకు బిగ్ బాస్ షోలోకి వస్తుందనే రూమర్లు కూడా వచ్చాయి. అవి కూడా నిజం కాదని నిన్నటి తేలిపోయింది.
అయితే వర్షిణి మాత్రం సోషల్ మీడియా ద్వారానే బాగానే సంపాదిస్తోన్నట్టుంది. తాజాగా ఆమె తన స్కిన్, హెయిర్ ప్రొటెక్షన్ కోసం క్లినిక్‌కు వెళ్లింది. పనిలో పనిగా ఆ క్లినిక్‌కు ప్రమోషన్ చేసేసింది. అలా డబ్బులు కూడా చేతిలో పడినట్టున్నాయి. మొత్తానికి సెలెబ్రిటీలు మాత్రం సోషల్ మీడియాను తెలివిగానే వాడుకుంటున్నారు. అలా ఈజీగా సంపాదించేస్తున్నారు.
View this post on Instagram