Home » Entertainment » Anchor Vishnu Priya About Casting Couch And Me Too
Entertainment

Vishnu Priya : మగాళ్లు కంట్రోల్ చేసుకోవాలి.. కమిట్మెంట్లపై యాంకర్ విష్ణు ప్రియ కామెంట్లు

Authored By
aruna
The Telugu News | Published on: September 22, 2022, 12:00 pm
Advertisement

Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ బుల్లితెరపై చేసే సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె వేసే స్టెప్పులకు అందరూ ఫిదా అవుతుంటారు. బుల్లితెరపై, సోషల్ మీడియాలో ఆమె స్టెప్పులు విపరీతంగా ట్రెండ్ అవుతుంటాయి. ఆమె ఊపు ఊపితే వ్యూస్ పరిగెత్తాల్సిందే. అయితే ఈ మధ్య ఆమె ఎక్కువగా జరి జరి పాటతో ట్రెండ్ అవుతోంది. మానస్, విష్ణుప్రియ కలిసి చేసిన ఈ ప్రైవేట్ సాంగ్ అదిరిపోయింది.

Advertisement

యూట్యూబ్‌లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ పాట గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో మానస్, విష్ణుప్రియ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ పాటకు తనను శేఖర్ మాస్టర్ రిఫర్ చేశారని చెబుతూ విష్ణుప్రియ ఫుల్ ఖుషీ అయింది. శేఖర్ మాస్టర్ వల్లే తనకు ఈ అవకాశం వచ్చిందంటూ చెబుతూ ఫుల్ ఎమోషనల్ అయింది. ఈ ఇండస్ట్రీలో ఉండాలంటే.. లక్ ఉండాలనేది తన అభిప్రాయమని చెప్పుకొచ్చింది.

Anchor Vishnu Priya About Casting Couch And Me too

Advertisement

కాస్టింగ్ కౌచ్ మీద స్పందిస్తూ.. అన్ని ఇండస్ట్రీల్లోనూ అలానే ఉంటుందని, తనను కూడా కొంత మంది కమిట్మెంట్లు అడిగారని, కానీ తనకు అలాంటివి నచ్చవని చెప్పుకొచ్చింది. ప్రతీ చోటా ఇలాంటివే ఉంటాయి.. ఇది పురుషాధిక్య సమాజం.. వాళ్లు హార్మోన్లు కంట్రోల్ చేసుకోవాలి.. అని విష్ణుప్రియ కాస్త నాటీ కామెంట్లు చేసింది. మొత్తానికి విష్ణుప్రియ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఆమెనటించిన వాంటెడ్ పండుగాడ్ చిత్రం దారుణంగా బెడిసి కొట్టేసింది. అందులో ఆమె పాత్రకు ఎటువంటి ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. ఆమె అందాల ప్రదర్శన కూడా అంతగా పేరు తీసుకురాలేదు. కానీ ఇప్పుడు ఈ పాటతో ఒక్కసారిగా ఆమె పేరు మార్మోగిపోతోంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి