Vishnu Priya : రాత్రికి రాత్రి సమంత లాగా లైఫ్ ని చాలా పెద్ద రిస్క్ లో పెట్టుకున్న విష్ణు ప్రియ..!

Advertisement

Vishnu Priya : ఇటీవల ఇండస్ట్రీలో ఉండే చాలామంది ముద్దుగుమ్మలు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతున్నారు. పొట్టి బట్టలు వేసుకుని ఎక్స్ పోజింగ్ చేసే స్టార్ బ్యూటీస్ కూడా తమలోని మరో యాంగిల్ ని బయటపెడుతున్నారు. పుణ్యక్షేత్రాలు దైవ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన సినిమాలకు బ్రేక్ చెప్పి మరి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటుంది. అయితే తాజాగా మరో బ్యూటీ కూడా ఆధ్యాత్మిక వైపు వెళ్ళింది. ఆమె మరెవరో కాదు బుల్లితెర పాపులర్ యాంకర్ విష్ణు ప్రియ.

Advertisement

సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా హాట్ ఫోటోలు, హాట్ వీడియోస్, ట్రెండీ ఫోటోలను షేర్ చేసే యాంకర్ విష్ణు ప్రియ ఈసారి ఎవరు ఊహించని విధంగా ఆమె మెడలో దండతో ఊహించని విధంగా దర్శనం ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యాంకర్ విష్ణు ప్రియ కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చి ఆధ్యాత్మికత బాట పట్టబోతుంది అంటూ తెలుస్తోంది. యూపీలోని వారణాసికి వెళ్లిన విష్ణు ప్రియ తెల్ల దుస్తులు ధరించి మెడలో పూలదండతో చాలా ట్రెడిషనల్ గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement
Anchor Vishnu Priya doing like Samantha
Anchor Vishnu Priya doing like Samantha

ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ లుక్స్ తో ఎక్స్పోజింగ్ చేసే విష్ణు ప్రియ ఈసారి ట్రెడిషనల్ గా కనిపించడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈషా ఫౌండేషన్ లో సమంత ఏ విధంగా అయితే కనిపించిందో విష్ణు ప్రియ కూడా అదే విధంగా కనిపించింది. దీంతో సమంత విష్ణు ప్రియ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి వీళ్ళు ఇంత సడన్గా ఇలా ఎందుకు మారిపోతున్నారు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే విష్ణు ప్రియ ప్రస్తుతం ఎటువంటి షోలలో యాంకర్ గా చేయట్లేదు. అప్పుడప్పుడు కొన్ని ప్రైవేటు సాంగ్స్ లలో కనిపిస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ పాపులారిటీ సంపాదించుకుంటుంది.

Advertisement
Advertisement