Anchor Vishnu Priya : దగ్గరుండి మరీ ట్రైనింగ్.. ఎగురుతానా? అంటూ యాంకర్ విష్ణుప్రియ రచ్చ
Anchor Vishnu Priya యాంకర్ విష్ణుప్రియ ప్రస్తుతం ఏదో యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలానే కష్టపడుతోన్నట్టు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా జిమ్ చేస్తోంది. అంతే కాకుండా జంపింగ్‌లు నేర్చుకుంటోంది. యాక్షన్ సీక్వెన్స్‌లో హీరోలు జంప్‌లు చేసినట్టుగా విష్ణుప్రియ కూడా చేసేందుకు రెడీ అవుతోన్నట్టు కనిపిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా విష్ణుప్రియ ట్రైనింగ్ తీసుకుంటోంది.

anchor vishnupriya in work outs
గత కొన్ని రోజులుగా నిరంతరంగా జంప్‌లు చేయడంలో విష్ణుప్రియ నానా కష్టాలు పడుతోంది. ట్రైనర్ సమక్షంలో రోజూ ప్రాక్టీస్ చేస్తోంది. రోప్స్ సాయంతో జంపింగ్లు చేస్తోంది. బాల్స్‌ను అడ్డం పెట్టుకుని జంపింగ్లు, ఫ్లిప్ అవ్వడం వంటివి నేర్చుకుంటోంది. తాజాగా వాటి సాయం లేకుండా చేసేందుకుప్రయత్నించింది. కానీ పక్కనే ట్రైనర్ ఉండి సాయం చేశాడు.
Anchor Vishnu Priya వర్కవుట్లతో విష్ణుప్రియ

anchor vishnupriya in work outs
వెనక్కి ఫ్లిప్ అవ్వడం నేర్చుకుంటోన్న విష్ణుప్రియ ఒంటరిగా ట్రై చేసింది. వెనకాల నుంచి ట్రైనర్ పట్టుకుంటే.. విష్ణుప్రియ ఫ్లిప్ అయింది. అయితే నెక్స్ట్ నుంచి మీ సాయం లేకుండా నేను ఒంటరిగానే వెనక్కి ఫ్లిప్ అవ్వగలనా? ఎగరగలనా? అని విష్ణుప్రియ అభిమానులను ప్రశ్నించినట్టుంది. మొత్తానికి తన సపోర్ట్ సిస్టమ్ ట్రైనరే అంటూ చెప్పుకొచ్చింది.